కథ పేరు : హీరో
రాసిన వారు: సాయి ప్రసాద్ సోమయాజుల (కెనడా)
హీరోలంటే ఆరడుగుల దేహమూ ఆరు పలకల ఉదరమే ఉండక్కరలేదు . నా దృష్టి లో హీరోయిజంకి లింగబేథం లేదు.
అలాంటి ఒక విలక్షణ హీరోయే మన కథా నాయిక పోలిపిల్లి
ఎవరి పేరు తలిస్తే మామూలు రోజులు పండగ రోజులవుతాయో, ఎవరి రేరు చెపితే పని కి జ్వరం వచ్చి వొణికిపోతుందో ఆమె పేరే పోలిపిల్లి
నిగనిగ మెరిసే నీలవర్ణమూ , చూడగానే ఠక్కున రంగు పేరు చెప్పగలిగే ఏకాండి రంగు చీర, పిక్కల పై కి గోచీ పోసి కట్టి, చేతులకు కాళ్ళకు పెద్ద వెండి మురుగులు, నత్తు బరువు తోనే ముక్కు గుమ్మం కిందికి జారిందా అన్నట్టు బరువైన ఇత్తడి నత్తు, గట్టిగా ముడి వేసిన కొప్పు, వెరసి పోలిపిల్లి ఒక బలమైన ఫాషన్ స్టేట్మెంటు
మా ఉత్తరాంధ్రలో కొన్ని పేరులు సర్వ నామాలు. అదే పేరు ఒక గ్రామదేవతకుండొచ్చు. గ్రామానికిఉండొచ్చు. మనుషుల్లో అయితే స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఉండొచ్చు.
అలాంటి పేర్లలో పోలిపిల్లి ఒకటి
సుమారు 40 ఏళ్ల క్రితం. మా విజయనగరం లో తాత గారి ఇంట్లో ఉండే వాళ్ళం. వారిది పెద్ద కుటుంబం. మామూలు గానే ఇంట్లో ఉండేది పాతిక మంది వరకూ అయితే, వచ్చీ పోయే వాళ్ళు మరొక పాతిక మంది వరకూ ఉండేవారు. మీకు తెలియకపోవచ్చు గాన్నీ ఆ రోజుల్లో మా విజయనగరం ఉత్తరాంధ్ర కు ఒడిస్సా కు మధ్య ప్రదేశ్ కు ఒక త్రికోణ సంధి. ఈ రోజు కి కూడా .
విజయనగరం చుట్టు పక్కల గ్రామాల నుంచి చిన్నా చితకా పనులు చేసుకునే మహిళలు అప్పుడప్పుడూ మా విజయనగరం సిటీ లోకి (ఏమాటకామాటే చెప్పొద్దూ. మా విజయనగరాన్ని సిటీ అంటే ఛాతీ ఇప్పటికీ పొంగుతోంది) వచ్చి ఇళ్లలో పనులు చేసేవారు.
అప్పట్లో పని మనుషులు రెండు రకాలు. ఒకరు ప్రతి రోజూ వచ్చి రొటీన్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోయేవారు. ఇంకొకరు అతిధి పాత్ర లో అప్పుడప్పుడు వచ్చి రెండు మూడు రోజులు మా ఇంట్లోనే ఉంది కొంచెం పెద్ద పెద్ద పనులు చేసి పోయేవారు.
అల్లాంటి ఒక అతిధి పాత్ర మన కధా వస్తువు పోలిపిల్లి.
మా తాత గారింట్లో మగవాళ్లందరూ చిన్న వయసులోనే మరణించారు. ఇంట్లో ఆడ పెత్తనం నడిచేది. పెత్తనం అనేకంటే నాయకత్వం అనడం కరెక్ట్ . వారిది పెద్ద ఇల్లు. సుమారు 20 పడక గదులు, మూడు మేడలు, ఆరు వాకిళ్లు. ఇల్లు రెండు వీధులను కలుపుతూ ఉండేది. వీధి గుమ్మం ఒక వీధి లో ఉంటె, పెరటి గుమ్మం వెనక వీధి లో ఉండేది. ఆడవాళ్మయూ ఆ ర్ధవంతంగా ఆ జమీందారీ లాంటి కుటుంబాన్ని ఎడం చేత్తో నడిపేవారు.
ఆ రోజుల్లో ఫోన్లు, వాట్సాప్ లు లేవు కదా. పోలిపిల్లి వస్తున్నట్టుగా ఎలాంటి కబురూ ఉండేది కాదు. కానీ పోలిపిల్లి రాక విషయం లో ఒక అద్భుతం జరిగేది. మా ఇంట్లో ఆడ పెద్దలకి పోలిపిల్లి వస్తున్నట్టుగా సిక్స్త్ సెన్స్ చెప్పేది.
ఇవాళ పోలిపిల్లి వస్తుందర్రా అనేవారు. అన్నట్టుగానే సునామి లా పోలిపిల్లి వచ్చేది. సునామీ అని ఎందుకన్నానంటే పోలిపిల్లి చాలా వేగం గా నడిచేది. తన వూరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చినా రాగానే అలసట నీరసం అని కూలబడేది కాదు. ఎదురుగా ఏ పని కనపడితే ఆ పనిని చనువుగా అందుకునేది. చాలా సార్లు ఇంకొక గమ్మత్తు జరిగేది. మా తాత గారిది పెద్ద కుటుంబం కావడంతో ఎప్పుడూ చుట్టూ పక్కల ఊళ్ళ నుంచి ఎవరో ఒకరు వస్తుండేవారు. అదే సమయానికి పోలిపిల్లి కనుక వస్తుంటే నేరుగా మా చుట్టాల రిక్షా లోంచే వారి సామాన్లని తలపైన మోసుకుని వచ్చేసేది.
పోలిపిల్లి వచ్చిందంటే మా ఇంట పండగ వాతావరణం. ఎందుకంటే పోలిపిల్లి పండగలలోనే తప్పకుండా వచ్చేసేది. ఒకవేళ పండగ కాకపోయినా మా వాళ్ళు పోలిపిల్లి ఎప్పుడు వస్తే అప్పుడు పండగ పనులు మొదలు పెట్టేసేవారు.
మచ్చు కి పోలిపిల్లి అవలీలగా చేసేసే చేయగలిగే కొన్ని సూపర్ హీరో పనులు:
సున్నాలు వేయడం
పెద్ద పెద్ద వంట పాత్రలను పదుల్లో ఇరవైల్లో అవలీలగా తోమి పడేసేయడం
నాలుగు వందల గజాల ఇంటిని ఈ చివరనుంచీ ఆ చివర వరకూ సర్ఫ్ వేసి కడిగేసి పొడిగా తుడిచేసి ముగ్గులేసేసేది
చంటిపిల్లలకు అలవోకగా నలుగుపెట్టి స్నానాలు చేయించడం (నిజం చెప్పొద్దూ ... ఆ వయసులో పోలిపిల్లి నెలల పిల్లలకి కాళ్లమీద వేసుకుని బలంగా నలుఁగుపెట్టి తలమీద చేతుల్ని డొప్పల్లా చేసి మోదుతూ వేడి నీళ్ల తో స్నానం చేయిస్తుంటే ఆ పిల్లలు కేర్ కేర్ మని ఏడుస్తూంటే చాలా హింసాత్మకంగా అనిపించేది కానీ ఇప్పుడు తలుచుకుంటే ఆహా అనిపిస్తోంది)
పెద్దలకు సైతం (ఆడవాళ్ళకు) తలంట్లు పోసేయడం చిక్కులు తీయడం జడలు వేయడం పేలు చూడడం
లెక్క పెట్టకుండా వీధి చివర కొళాయి నుండి ఇంట్లో కి బిందెలతో నీళ్లు మోసెయ్యడం
మనకి అటు పక్క నడిస్తేనే ఘాటు తో పొలమారితే , అవలీల గా నాలుగైదు గంటల పాటు ఎర్ర మిరపకాయలు దంపుడు కారం దంచేయడం
అటుపక్క నడవడానికి మేము భయపడితే, మమ్మల్ని చూసి పకపకా నవ్వడము, లేదా చేతి తో కారం తీసే మా మీద వేస్తానని చిలిపిగా బెదిరించడం
ఆడపిల్లలతో సెకండ్ షో సినిమా కి సెక్యూరిటీ గార్డ్ లా వెళ్లడం
కొత్త సినీమాకి తొక్క్కిసలాటలో మగాడిలా వెళ్లి టికెట్స్ తీసుకురావడం
గాంధీగారి స్వప్న భారతంలా అర్ధ ఒంటరిగా తిరిగడం
నాలుగు పలుదోం పుల్లలతో ఒక్క మారు చీరతో వచ్చి , వారూ వీరూ ఇచ్చిన చీరలతో సబ్బు తో పొగడ్రి (పోలిపిల్లి భాష లో పేస్ పౌడర్ ) తో వారాల తరబడి సంతోషంగా గడిపెయ్యడం
అన్నట్టు ఆ రోజుల్లో తన ఇంట్లో నలుగురు దొంగలు జొరబడితే పోలిపిల్లి ఒంటి చేతి తో వాళ్ళని తరిమి కొట్టిందట
మా పెద్దవాళ్ల మీద గౌరవంతో, వాళ్ళు చూస్తే తిడతారని భయం తో, పెరట్లోకి వెళ్లి చుట్టని అడ్డపోగా వెయ్డ, తరవాత మా పెద్ద వాళ్ళు వాసనని పట్టేసే " చుట్ట కాల్చేవెంటే గుంటముండా " అంటే పగలబడి నవ్వడం
అన్నట్టు ఆ రోజుల్లో ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే పిల్లలకు చాకోలెట్స్ బిస్క్యూట్స్ కొనుక్కోమని, పెద్దలకి గాజులు వేయించుకోమని డబ్బులు ఇచ్చేవారు. కానీ మా పోలిపిల్లి కి స్పెషల్ పర్పస్ గ్రాంట్స్ ఇచ్చేవారు "ఇంద చుట్టలు కొనుక్కో " అని డబ్బులిచ్చేవారు .
ఇంకా పోలిపిల్లి కి కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి.
ఆమెకి దిష్టి మంత్రమూ తేలు మంత్రమూ వచ్చు . ఎవరికైనా తేలు కుడితే పోలిపిల్లి మంత్రమేస్తే తగ్గేది. అంతే కాక, తేలు కుట్టిన చోట నోటితో విషాన్ని పీల్చి ఉమ్మేసేగలది.
మా ఇంట్లో పెద్దలకి పోలిపిల్లి ఒక రామభక్త హనుమాన్ లా ఉండేది. రాగానే ఇంటి పెద్దావిడ కాళ్ళు, నడుము ఏది పెట్టమంటే అది పట్టేది. ఎవరికైనా ఎప్పుడైనా హోటల్ నుంచి దోసెలు, కిరాణా కొట్టు నుండి కూల్ డ్రింక్స్ కావాలంటే ఒక్క అంగలో వెళ్లి తెచ్చేసేది. కూల్ డ్రింక్స్ పేర్లు తెలిసేవి కాదు. మాజ ని మాడిపళ్ళ రసం, గోల్డస్పాట్ ని నారింజ రసం, లిమ్కా ని నిమ్మ రసం అని మేనేజ్ చేసేసేది. మడీ తడి తెలుసుకుని మసిలేది. దేముడి గది ఛాయలకి కూడా వచ్చేది కాదు. ఎప్పుడైనా పిలిచి ప్రసాదం ఇస్తే దూరం నుంచే అందుకునేది. ఎప్పుడూ చనువు తీసుకునేది కాదు. కొన్ని ఏళ్ల తరబడి తెలిసిన ఇల్లయినా, ఇంట్లో గుట్లు తెలిసినా కానీ ఎప్పుడూ కూడా తల దూర్చేది కాదు. తన పని అను చేసుకుని పోయేది. పోలిపిల్లి ని కూర్చుని ఉండగా ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ ఎదో ఒక పని చేస్తూనే తిరుగుతూనే కనబడేది.
ఇంక సినిమా కి వెళితే పోలిపిల్లి ఎమోషన్స్ చూడాలి. విలన్ ని చూడగానే "ఆడ్ని సంపేయ్ ఆడ్ని సంపేయ్ " అని వొళ్ళు మరిచి పోయి అరిచేసేది.
ఇంకా ఎప్పుడైనా తాను చూసి మేము చూడని సినిమా కధ మాకు చెప్పమంటే తమాషా చూడాలి . శ్రీకాకుళం యాస లో, తెలంగాణా మాండలీకం లో రామాయణం చెప్పినట్టు చెప్పేది. మచ్చుకి, నాగభూషణం వాణిశ్రీ ని మానభంగం చేయబోయే సన్నివేశం పోలిపిల్లి మాటలలో " ఆ పాలి, నాగభూషణంవోడు వాణిశ్రీ ని అంగబంగం సేయాలని సూత్తాడు . సూత్తే అప్పుడు ఎంటీవోడొచ్చి నాగభూషణంవోడ్ని సంపెత్తాడు "
పోలిపిల్లి మా ఇంట్లో నే కాదు తన ఇంట్లో కూడా హీరోనే .
పోలిపిల్లి కి చిన్న తనం లోనే భర్త పోయాడు. ఒక్క కొడుకుని తానె పొలం పనులూ ఆ ఇంటా ఈ ఇంటా పనులు చేసుకుంటూ పెద్ద చేసి పెళ్లి చేసింది.
అందరి ఇళ్లలో పనులు చేసే పోలిపిల్లి ని మీ ఇంట కూడా పనులు చేస్తావా అని అడిగితె " మా ఇంట నేను సేయనమ్మా. నా కోడలు నేదేటి . అదే సేత్తాది పనులు. నేనింటికెళ్లి ఏ న్నీళ్ళ తానం సేసి తొంగుంటాను. మా కోడలు నీసొండెడితే తిని మళ్ళీ తొంగుంటాను. ఒళ్ళు బాగా నొప్పులుంటే అంత నల్లమందేసుకుని తొంగుంటానమ్మా అనేది .
చుట్టా , కల్లు, నల్లమందూ పోలిపిల్లి నేస్తాలు.
ఒక్క చీర పెడితే పొంగిపోయి చాటంత నవ్వు నవ్వేది.
నిజాయితీ కి మారుపేరులా ఉండేది. ఒకసారి ఎవరిదో చుట్టాలది చిన్న బంగారం వస్తువు పొతే అదే గదిలో ఒక మూల నిద్రపోయిన పోలిపిల్లీని అనుమానించి అడగడం జరిగింది. పోలిపిల్లి ఏడ్చి, అందరి దేవుళ్ళు మీద సత్తె పెమాణికం సేసి నానా రభసే చేసింది. చివరికి ఆ వస్తువు వారి బట్టలకి చిక్కుకుని కనబడింది. ఆ తరువాత పోలిపిల్లి క్రెడిట్ రేటింగ్ AAA + స్థాయికి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఎన్నో సార్లు ఎవరెవరో పోగొట్టుకున్న పర్సులూ , డబ్బులూ, వస్తువులూ పోలిపిల్లి వెతికి తీసుకురావడం పరిపాటి అయింది. అంతే కాదు - ఏదైనా వస్తువు పొతే, పోలిపిల్లీ కొంచెం వెతికి పెట్టవే అంటే రోబోట్ లా ఇల్లంతా కలియదిరిగుతూ వెతుకుతూ చాలా హడావిడి చేసేది.
పోలిపిల్లి కి అప్పుడప్పుడు వొళ్ళు తెలియని జ్వరం వచ్చేది. అలా జ్వఅం రం వచ్చి పడుకుంటే మా పెద్దవాళ్ళు "దానికి ఒళ్ళెరగని పని చేసి ఊష్ణం వొచ్చిందర్రా " అనేవారు .
మేము జీవన పయనం లో విజయనగరం వదిలి రాష్ట్రాంతరం దేశాంతరం దాటాక ఎప్పుడో ఒక గాలి వార్త వచ్చింది. ఒక సారి విపరీత జ్వరం వచ్చి ఎప్పటికీ తగ్గలేదని, పోలిపిల్లి ఇంకా లేవలేదని తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయిందని.
ఇప్పుడు చెప్పండి ? మా పోలిపిల్లి గొప్ప హీరోనా ? రజనీకాంత్ గొప్ప హీరోనా? సినిమాల్లో హీరో లకి డూప్స్ ఉంటారు. స్పెషల్ ఎఫెక్ట్స్ లో వాళ్ళు చెయ్యనివి చేసినట్టుగా చూపిస్తారు. కానీ మా పోలిపిల్లి రియల్ హీరో. ఆమెకి దూప్స్ లేరు.
ఈ మధ్య ఒక సినిమా లో ఎవరో చెప్పినట్టుగా " పోలిపిల్లి సింగల్ కాపీ"
సమాప్తం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి