24, జనవరి 2020, శుక్రవారం

కధ పేరు: జఠరాగ్ని హోమం వ్రాసిన వారు: సోమయాజుల సాయి ప్రసాద్ (కెనడా)



కధ  పేరు: జఠరాగ్ని  హోమం   వ్రాసిన వారు: సోమయాజుల సాయి ప్రసాద్ (కెనడా)

===========================

మనిషి లోని స్పందన కి కార్య రూపమిస్తే, ఆలోచన ఉద్యమమౌతుంది.

 చిన్న చినుకుల  లాంటి సదాలోచనలు, దిశా నిర్దేశం తో,  మానవ సమస్యల మీద ఉప్పెనలా విరుచుకు
పడి, మన సమస్యలని తుడి చి పెట్టేస్తాయి.

అట్లాంటి ఒక చిరు చినుకు జడి వాన అయి, మానవ జాతిని పీడిస్తున్న ఆకలి రాకాసిని తుదముట్టిస్తే ఎలా ఉంటుంది అన్న కధ ఈ జఠరాగ్ని  హోమం.

జఠరాగ్ని  అంటే ఆకలి.  అటువంటి ఆకలిని చల్లార్చడానికి తలపెట్టిన ఒక ఉద్యమమే ఈ జఠరాగ్ని  హోమం.
===========================

నేను కొంచెం సెన్సిటివ్ ని అని అందరూ అంటుంటారు.  ఆ గుణమే నేమో, ఇవ్వాళ పొద్దున్న అంతర్జాలం  లో "ఈనాడు" దినపత్రిక లో ఒక వార్త చదవగానే, తింటున్న టిఫిన్ అలాగే వదిలేసి గబా గబా చెయ్యి కడుక్కుని ఆఫీసు కి వెళ్లి పోయాను.

ఆఫీసు కి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నానే కాని, నా ఆలోచనలన్నీ కూడా ఆ వార్త మీదే.  తాటికాయలంత అక్షరాలతో రాసిన ఆ వార్త గుర్తుకొస్తే, ఈ రోడ్లు, ఈ భవనాలు, ఈ సాంకేతిక పురోగతి, ఇవన్నీ, అన్నీ పూర్తిగా వృధా అనిపిస్తోంది. మనిషి ఎంత పురోగతి చెండుతున్నాడో, అంత వెనకపడి కూడా ఉన్నాడని అనిపిస్తోంది.

"భూ ప్రపంచం మొత్తం మీద 100 కోట్ల మంది ప్రతి రోజు ఆకలి తో అలమటిస్తున్నారు"

ఇదీ ఆ వార్త సారాంశం.

అందులో -  30 కోట్ల మంది మన భారత దేశం లోనే ఉన్నారట.

సిగ్గు చేటు.

కనీసం 10 - 15 సార్లు అనుకుని వుంటాను ఈ మాటని.

ఆఫీసు లో కూర్చుని పని చేస్తున్నానే కానీ ఆలోచనలు మాత్రం ఈనాడు వార్త మీదనే ఉన్నాయి.
మధ్యాన్నానికల్లా విపరీతమైన తల నొప్పి వొచ్చి బాస్ కి చెప్పి ఇంటికి వోచ్చేసాను.
 *                     *                        *                          *

సాయంత్రం ఆరు గంటలయింది.   మా పెద్దాడు హోం వర్క్ తో కుస్తీ పడుతుంటే హెల్ప్ చేద్దామని వెళ్లాను.

డాడీ, నాకు తెలిసిన లెక్కల పరిజ్ఞానంతో  ఏదైనా ఒక ప్రపంచ సమస్య ని సాల్వ్ చెయ్యమని ప్రాజెక్ట్ ఇచ్చారు టీచర్. అందరు స్టూడెంట్స్ ఇచ్చే ప్రాజెక్ట్ reports లో మంచి ప్రాజెక్ట్స్ ని UNO  (ఐక్య రాజ్య సమితి) కి పంపిస్తారట.  వాళ్లకి నచ్చితే ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళే ఆ సమస్య ని నిర్మూలించడానికి ఆచరణలో పెడతారట.  ఏం చేస్తే బాగుంటుంది?

ఒక్క క్షణం....మెరుపులా మెరిసింది ఒక ఐడియా నాలో.

ఒక్క ఉదుటున laptop అందుకుని ఎక్సెల్ లో అంకెలు, ఫార్ములాలు వెయ్యడం మొదలుపెట్టాను.

5 నిమిషాల్లో -  భారత దేశం లో ఆకలిని సమూలంగా పెకిలించడానికి అంకెల గారడీ తయారు చేసాను.

=40 /4X2X365X300000000/62 =  USD 35 billion

ఒక కిలో బియ్యం Rs 40 , నలుగురి మనుషులకి సరిపోతుంది. రెండు పూటలా, 365 రోజులకు , 30  కోట్ల మందికి అయ్యే రూపాయలలో  ఖర్చు డాలర్లలోకి మార్చిన మొత్తం ఇది.

సరిగ్గా అదే సమయానికి ఇంకొక వార్త నా మదిలో మెదిలింది.

వచ్చే 5 సంవత్సారాలలో మౌలిక సదుపాయాల కోసం భారత్ వెచ్చిన్చాబోతున్న ఖర్చు USD 1 .5 trillion

ఇంత budget తో మౌలిక సదుపాయాలు చేయాలని కాంక్షించే నా జన్మ భూమి కి - ఒక ఏడాదికి  జఠరాగ్ని  చల్లార్చడానికి అయ్యే మొత్తం చాలా చాల చిన్న మొత్తం.

అంటే - మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టె మొత్తం లో 50వ వంతు ఏటా ఖర్చు పెడితే, 30 కోట్ల మంది జఠరాగ్ని ని  ఏటేటా తీర్చగలిగే అవకాశం

పాలకులను, బడ్జెట్  నీ, విత్త మంత్రి నీ, ఎవరూ ఎవర్నీ నీలాపనిందలు  వెయ్యకుండా, సామరస్యం తో ఆలోచించి సరైన ప్రణాళిక వేసి ఆచరణలో పెట్టగలిగితే - ప్రపంచం లో మూడో వొంతు జఠరాగ్ని ని  ఒక్క ఉదుటున చల్లార్చొచ్చు

మా పెద్దాడికి నా లెక్క,,  వ్యూహం ప్రాజెక్ట్ తయారు చెయ్యమన్నాను.

ఇప్పుడు నాకెంతో తేలికగా  గా ఉంది.

సమస్య పరిష్కారం  అయిపోయిందని కాదు.  పరిష్కరింపలేనంత పెద్ద భూతం లా కనపడడం లేదు ఈ ఆకలి సమస్య ఇప్పుడు.  అతి త్వరలోనే పరిష్కరిమ్పబడుతుందని విశ్వాసం కలిగింది.


*                        *                     *                             *

సుమారు రెండు  సంవత్సరాల తరువాత....

మా పెద్దాడు యూనివర్సిటీ  కి వెళ్ళిపోయాడు. నేను పదవీ విరమణ పూర్తి  అయ్యి పారమార్ధిక ప్రపంచాన్వేషణలో పడ్డాను.

ఒక రోజు...

ఫోన్ మోగితే తీశాను.

మా పెద్దాడి స్కూల్ నుంచి...

వాళ్ళు చెప్పిన విషయం విని ఒక్క క్షణం ప్రపంచం లో ఎంతో ఎత్తున కూర్చున్న ఫీలింగ్ కలిగింది

మా పెద్దాడు చేసిన స్కూల్ ప్రాజెక్ట్  UNO వాళ్లకి బాగా నచ్చి వాళ్ళు భారత ప్రతినిధి కి పంపించారని, భారత్ కి ఆ సరళ శైలి,  లాజిక్ నచ్చి కనువిప్పు కలిగి, మిగిలిన ధనిక దేశాల లో లాగానే ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం తో దళారుల ప్రమేయం లేకుండా లాభాపేక్ష లేని ఫ్రీ ఫుడ్ బ్యాంక్స్ నడపాలని సంకల్పించిందని, అటువంటి మొట్ట మొదటి బ్యాంకు ఇంకొక రెండు నెలలో ప్రారంభించ బోతున్నారని, ఆ సందర్భంగా ,  ఆ ప్రాజెక్ట్ కి ఐడియా ఇచ్చిన మా పెద్దాడిని వేదిక మీదకి పిలిచి భారత ప్రభుత్వం సత్కరిస్తున్దన్నది -  ఆ ఫోన్ కాల్ సారాంశం.

కధలో ముందు చెప్పినట్టుగా

మనిషి లోని స్పందన కి కార్య రూపమిస్తే, ఆలోచన ఉద్యమమౌతుంది.

 చిన్న చినుకులు  లాంటి సదాలోచనలు సైతం, దిశా నిర్దేశం తో,  మానవ సమస్యల మీద ఉప్పెనలా విరుచుకు పది, మన సమస్యలని తుదిచి పెట్టేస్తాయి

హోమానికి సంకల్ప బలం ముఖ్యం.  అది -  జఠరాగ్ని  హోమం ఆయినా సరే.

( సమాప్తం)
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి