24, జనవరి 2020, శుక్రవారం

కధ పేరు: జఠరాగ్ని హోమం వ్రాసిన వారు: సోమయాజుల సాయి ప్రసాద్ (కెనడా)కధ  పేరు: జఠరాగ్ని  హోమం   వ్రాసిన వారు: సోమయాజుల సాయి ప్రసాద్ (కెనడా)

===========================

మనిషి లోని స్పందన కి కార్య రూపమిస్తే, ఆలోచన ఉద్యమమౌతుంది.

 చిన్న చినుకుల  లాంటి సదాలోచనలు, దిశా నిర్దేశం తో,  మానవ సమస్యల మీద ఉప్పెనలా విరుచుకు
పడి, మన సమస్యలని తుడి చి పెట్టేస్తాయి.

అట్లాంటి ఒక చిరు చినుకు జడి వాన అయి, మానవ జాతిని పీడిస్తున్న ఆకలి రాకాసిని తుదముట్టిస్తే ఎలా ఉంటుంది అన్న కధ ఈ జఠరాగ్ని  హోమం.

జఠరాగ్ని  అంటే ఆకలి.  అటువంటి ఆకలిని చల్లార్చడానికి తలపెట్టిన ఒక ఉద్యమమే ఈ జఠరాగ్ని  హోమం.
===========================

నేను కొంచెం సెన్సిటివ్ ని అని అందరూ అంటుంటారు.  ఆ గుణమే నేమో, ఇవ్వాళ పొద్దున్న అంతర్జాలం  లో "ఈనాడు" దినపత్రిక లో ఒక వార్త చదవగానే, తింటున్న టిఫిన్ అలాగే వదిలేసి గబా గబా చెయ్యి కడుక్కుని ఆఫీసు కి వెళ్లి పోయాను.

ఆఫీసు కి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నానే కాని, నా ఆలోచనలన్నీ కూడా ఆ వార్త మీదే.  తాటికాయలంత అక్షరాలతో రాసిన ఆ వార్త గుర్తుకొస్తే, ఈ రోడ్లు, ఈ భవనాలు, ఈ సాంకేతిక పురోగతి, ఇవన్నీ, అన్నీ పూర్తిగా వృధా అనిపిస్తోంది. మనిషి ఎంత పురోగతి చెండుతున్నాడో, అంత వెనకపడి కూడా ఉన్నాడని అనిపిస్తోంది.

"భూ ప్రపంచం మొత్తం మీద 100 కోట్ల మంది ప్రతి రోజు ఆకలి తో అలమటిస్తున్నారు"

ఇదీ ఆ వార్త సారాంశం.

అందులో -  30 కోట్ల మంది మన భారత దేశం లోనే ఉన్నారట.

సిగ్గు చేటు.

కనీసం 10 - 15 సార్లు అనుకుని వుంటాను ఈ మాటని.

ఆఫీసు లో కూర్చుని పని చేస్తున్నానే కానీ ఆలోచనలు మాత్రం ఈనాడు వార్త మీదనే ఉన్నాయి.
మధ్యాన్నానికల్లా విపరీతమైన తల నొప్పి వొచ్చి బాస్ కి చెప్పి ఇంటికి వోచ్చేసాను.
 *                     *                        *                          *

సాయంత్రం ఆరు గంటలయింది.   మా పెద్దాడు హోం వర్క్ తో కుస్తీ పడుతుంటే హెల్ప్ చేద్దామని వెళ్లాను.

డాడీ, నాకు తెలిసిన లెక్కల పరిజ్ఞానంతో  ఏదైనా ఒక ప్రపంచ సమస్య ని సాల్వ్ చెయ్యమని ప్రాజెక్ట్ ఇచ్చారు టీచర్. అందరు స్టూడెంట్స్ ఇచ్చే ప్రాజెక్ట్ reports లో మంచి ప్రాజెక్ట్స్ ని UNO  (ఐక్య రాజ్య సమితి) కి పంపిస్తారట.  వాళ్లకి నచ్చితే ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళే ఆ సమస్య ని నిర్మూలించడానికి ఆచరణలో పెడతారట.  ఏం చేస్తే బాగుంటుంది?

ఒక్క క్షణం....మెరుపులా మెరిసింది ఒక ఐడియా నాలో.

ఒక్క ఉదుటున laptop అందుకుని ఎక్సెల్ లో అంకెలు, ఫార్ములాలు వెయ్యడం మొదలుపెట్టాను.

5 నిమిషాల్లో -  భారత దేశం లో ఆకలిని సమూలంగా పెకిలించడానికి అంకెల గారడీ తయారు చేసాను.

=40 /4X2X365X300000000/62 =  USD 35 billion

ఒక కిలో బియ్యం Rs 40 , నలుగురి మనుషులకి సరిపోతుంది. రెండు పూటలా, 365 రోజులకు , 30  కోట్ల మందికి అయ్యే రూపాయలలో  ఖర్చు డాలర్లలోకి మార్చిన మొత్తం ఇది.

సరిగ్గా అదే సమయానికి ఇంకొక వార్త నా మదిలో మెదిలింది.

వచ్చే 5 సంవత్సారాలలో మౌలిక సదుపాయాల కోసం భారత్ వెచ్చిన్చాబోతున్న ఖర్చు USD 1 .5 trillion

ఇంత budget తో మౌలిక సదుపాయాలు చేయాలని కాంక్షించే నా జన్మ భూమి కి - ఒక ఏడాదికి  జఠరాగ్ని  చల్లార్చడానికి అయ్యే మొత్తం చాలా చాల చిన్న మొత్తం.

అంటే - మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టె మొత్తం లో 50వ వంతు ఏటా ఖర్చు పెడితే, 30 కోట్ల మంది జఠరాగ్ని ని  ఏటేటా తీర్చగలిగే అవకాశం

పాలకులను, బడ్జెట్  నీ, విత్త మంత్రి నీ, ఎవరూ ఎవర్నీ నీలాపనిందలు  వెయ్యకుండా, సామరస్యం తో ఆలోచించి సరైన ప్రణాళిక వేసి ఆచరణలో పెట్టగలిగితే - ప్రపంచం లో మూడో వొంతు జఠరాగ్ని ని  ఒక్క ఉదుటున చల్లార్చొచ్చు

మా పెద్దాడికి నా లెక్క,,  వ్యూహం ప్రాజెక్ట్ తయారు చెయ్యమన్నాను.

ఇప్పుడు నాకెంతో తేలికగా  గా ఉంది.

సమస్య పరిష్కారం  అయిపోయిందని కాదు.  పరిష్కరింపలేనంత పెద్ద భూతం లా కనపడడం లేదు ఈ ఆకలి సమస్య ఇప్పుడు.  అతి త్వరలోనే పరిష్కరిమ్పబడుతుందని విశ్వాసం కలిగింది.


*                        *                     *                             *

సుమారు రెండు  సంవత్సరాల తరువాత....

మా పెద్దాడు యూనివర్సిటీ  కి వెళ్ళిపోయాడు. నేను పదవీ విరమణ పూర్తి  అయ్యి పారమార్ధిక ప్రపంచాన్వేషణలో పడ్డాను.

ఒక రోజు...

ఫోన్ మోగితే తీశాను.

మా పెద్దాడి స్కూల్ నుంచి...

వాళ్ళు చెప్పిన విషయం విని ఒక్క క్షణం ప్రపంచం లో ఎంతో ఎత్తున కూర్చున్న ఫీలింగ్ కలిగింది

మా పెద్దాడు చేసిన స్కూల్ ప్రాజెక్ట్  UNO వాళ్లకి బాగా నచ్చి వాళ్ళు భారత ప్రతినిధి కి పంపించారని, భారత్ కి ఆ సరళ శైలి,  లాజిక్ నచ్చి కనువిప్పు కలిగి, మిగిలిన ధనిక దేశాల లో లాగానే ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం తో దళారుల ప్రమేయం లేకుండా లాభాపేక్ష లేని ఫ్రీ ఫుడ్ బ్యాంక్స్ నడపాలని సంకల్పించిందని, అటువంటి మొట్ట మొదటి బ్యాంకు ఇంకొక రెండు నెలలో ప్రారంభించ బోతున్నారని, ఆ సందర్భంగా ,  ఆ ప్రాజెక్ట్ కి ఐడియా ఇచ్చిన మా పెద్దాడిని వేదిక మీదకి పిలిచి భారత ప్రభుత్వం సత్కరిస్తున్దన్నది -  ఆ ఫోన్ కాల్ సారాంశం.

కధలో ముందు చెప్పినట్టుగా

మనిషి లోని స్పందన కి కార్య రూపమిస్తే, ఆలోచన ఉద్యమమౌతుంది.

 చిన్న చినుకులు  లాంటి సదాలోచనలు సైతం, దిశా నిర్దేశం తో,  మానవ సమస్యల మీద ఉప్పెనలా విరుచుకు పది, మన సమస్యలని తుదిచి పెట్టేస్తాయి

హోమానికి సంకల్ప బలం ముఖ్యం.  అది -  జఠరాగ్ని  హోమం ఆయినా సరే.

( సమాప్తం)
 

23, జనవరి 2020, గురువారం

కధ పేరు: నారీ జన లక్ష్మీ సంవాదం వ్రాసినవారు: సోమయాజుల సాయి ప్రసాద్ (కెనడా)

కధ  పేరు: నారీ జన లక్ష్మీ సంవాదం

వ్రాసినవారు: సోమయాజుల సాయి ప్రసాద్ (కెనడా)

అల వైకుంఠపురమునందు క్షీరసాగరం.... ఒక సంధ్యా సమయం.. భానుడు దేవదేవునికి వంగి నమస్కరిస్తూ  అస్తమిస్తున్న సమయం.
క్షీర సాగరం లో అలలకు తూగుతున్న శేషసాయి పై పవళించిన విష్ణువు ఆ అలల తూగుకి అర్ధ నిమీళిత నేత్రాలతో యోగనిద్ర లో ఉండగా స్వామీ వారి పాడాలని మెత్తని అరచేతులతో ఒత్తుతూ స్వామి వా రి ముఖారవిందాన్ని అచ్చెరువుగా చూస్తూ ఉంది కమలవాసిని.

అంతటా ప్రశాంతత .  ఎక్కడా అలజడి కి తావులేని ఆ లోకం లో ఆ సమయం లో విష్ణుహృదయవాసిని హృదయం లో ఎదో అలజడి .... ఒక అశాంతత...
"స్వామీ!"  మంద్రస్వరం లో పిలిచింది
"ఊఁ  చెప్పు దేవీ"
"నాలో ఎదో అలజడి స్వామీ
"ఎందుకు దేవీ  ఎంత చక్కటి సంధ్యా సమయం ఈ సమయం లో చక్కగా భక్తుల పూజలనందుకుని చిరునవ్వు తో వరాల జల్లు కురిపించవలిసిన నా "శ్రీ" కి ఎందుకీ అలజడి?

ఆ భక్తుల గురించే స్వామీ నా అలజడి.

ఏమైంది దేవి మన లోకం తో పాటు భూలోకం కూడా ప్రశాంతంగానే ఉందిగా.  కాకపొతే కలికాలం కాబట్టి స్వల్పమైన కల్లోలాలు తప్పవు.

ఆ విపత్తులూ కల్లోలాలు కాదు స్వామీ నా అలజడి కి కారణం.

మరేమిటి దేవీ?

మన అంశతో మానవాళి  పుం స్త్రీ అని రెండు పరస్పర విరుద్ధ శక్తులను సృష్టించి విజాతి ధృవాలు ఆకర్షించుకుని  సృష్టి వృద్ధి జరగాలని మనం ఉద్దేశించాము కదా.

అవును కదా దేవీ అటులనే జరుగుతున్నది కదా ? ఇప్పుడేమైంది?

సృష్టి జరుగుతున్నది స్వామీ సృష్టి తో పాటే స్త్రే పురుష పరస్పర అహంకారములతో విధ్వంసమూ జరుగుతున్నది.

విధ్వంసమా?

అవును స్వామీ మనం లోక కళ్యాణం కోసం విజాతి ధృవాలని సృష్టిస్తే  ఇప్పుడు ఆ రెండు జాతులూ ఎవరు గొప్ప అని , మీరెందుకు ఎక్కువ మేమేమి తీసిపోయాము అని అంతర్యుద్ధం చేస్తున్నారు స్వామీ.

కానీలే దేవీ!  రసపట్టు లో కోప తాపాలు సహజమే కదా.

లేదు స్వామీ ఇది సరస కలహపు  హద్దులు దాటి, విరసపు పోరు అవుతోంది.  నేనెందుకు తగ్గాలి అని ఇరు జాతులూ పోటీ పడుతున్నారు. ఇది వికటించి మనం మానవాళి ని సృష్టించిన మూల కారణం ధ్వంసం కాకముందే నేను ఎదో ఒకటి చెయ్యాలి.

ఏమి చేస్తావు దేవీ?

నేను అలా భూలోకానికి వెళ్లి నా వంతు ఒక మాట చెప్పి చూసాను స్వామీ!

తధాస్తు  శుభం భూయాత్ అభయ ముద్ర లో ఆశీర్వదించారు స్వామీ.

పద్మం లో ధ్యానముద్ర లో కూర్చుని అంతర్ధానమైంది దేవి.

================================================================

హైదరాబాద్ లో త్యాగరాయ గాన సభ.

"తెలుగు రాష్ట్రాల మహిళా సమాఖ్య" పెద్ద అక్షరాలలో గాలికి ఊగుతున్న బ్యానెర్లు  ఆహ్వానం పలుకుతున్నాయి.

క్రమేణా సమావేశ ప్రాంగణం లోకి నారీ జనం వచ్చి ఆసీనులవుతున్నారు.  ఒక అరగంట లోనే ప్రాంగణం అంతా నిండిపోయింది.  నిర్దిష్ట సమయానికి దీపారాధనతో కార్యక్రమం మొదలయింది.

ముందుగా ఉభయ రాష్ట్రాల మహిళా మండలి కమీషనర్లు  ఉపన్యసించారు.  ఏటేటా పురుషల వలన స్త్రీలపై పెరుగుతున్న  హింస ఆకృత్యాలు, తరుగుతున్న గౌరవ మర్యాదలూ సంఖ్యా రేఖా చిత్రాల సాక్ష్యం గా చూపించారు.  ఈ పరిస్థితి మారడానికి తామేం చేస్తున్నదీ వివరించారు.

తర్వాత నారీ జన సంక్షేమానికి సంబంధించిన పలు అంశాల పై చర్చలు జరిగాయి.   పుట్టుకతోనే లింగ వివక్షత, బాల్యం, కౌమారం తో
ఆరంభించి పలు జీవన దశలలో వస్తున్న సమస్యలు, అందునా అధిక భాగం మగజాతి వలన వస్తున్న దిశగా చర్చలు సాగాయి.

ఒక గంట లో ఆ ప్రాంగణమంతా రెండే రెండు భావనలతో నిండి పోయింది -  స్త్రీ పట్ల సానుభూతి, పురుష ద్వేషం. అంతటా నిరాశ, నిస్పృహ.  సమస్య కనులముందు కనపడుతోంది కానీ పరిష్కారం కనుచూపు లో లేదు.

అప్పుడే ఉపన్యాసం చివరకు వచ్చిన ఒక వక్త " చూద్దాం ఎదో ఒక అద్భుతం జరిగి ఈ పరిస్థితులు మారక పోవా" అని ముగించారు.

సరిగ్గా అప్పుడు...అందరీ దృష్టీ వేదిక దగ్గరగా ఉన్న ఒక ప్రవేశ ద్వారం పై పడింది.  కారణం - ఒక మాదిరి మంద్రమైన కాంతి లో ఉన్న ఆ ప్రాంగణం లో ఆ ప్రవేశ ద్వారం దగ్గర ఒక తెల్లని మెరుపు మెరిసింది.  ఆ మెరుపు లోంచి సుమారు ఒక 30 సంవత్సరముల  వయస్సు ఉన్న స్త్రీ మూర్తి మెల్లగా నడిచివేస్తోంది.  ముదురాకు పచ్చని చీర, వొళ్ళంతా మెరుస్తున్న మేలిమి  బంగారపు నగలు , గజ గామిని యై ఆమె వేదిక వైపు నడుస్తూంటే  సభలోని వారు మాత్రమే కాక వేదిక పైన వారు కూడా  అప్రయత్నం గా లేచి నిలబడి ముకుళిత హస్తాలతో స్వాగతం పలికారు.

ఆమె వేదిక పైకి చేరగానే వేదిక మధ్య లో ఉన్న ఆసీనాన్ని ఆమెకిచ్చి నమస్కరించారు.

ఆమె ఆసీనురాలై అందరినీ ఆసీనులు కమ్మని రెండు చేతులతో సంజ్ఞ చేసేవరకూ అందరూ నిలపడే ఉన్నారు.  ఆ తర్వాత కూర్చున్నారు.

ఆమె సభని ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించింది.

"అమ్మాయిలూ , ఇప్పటివరకూ జరిగిన చర్చలు విన్నాను.   ఈ చర్చలలో నేను విన్న సారాంశం - మాకు అన్నిటా లోటు ఉంది. మాకు అన్యాయం జరుగుతోంది. మా సమస్యలకి పరిష్కారం క్లిష్టమవుతోంది. ఇవే కదా.

అవునని అంగీకార ప్రాయం గా తల ఊపారు వేదిక పై పెద్దలు.

అయితే ఇప్పుడు నేను కొన్ని సమస్యలు మీకు చూపిస్తాను. అవి చూసాక మీరే చెప్పండి - మనం సమస్యలు అనుకుంటున్నవి  నిజమైన సమస్యలా లేక మనం పరిష్కరించవలసిన సమస్యలు వేరే ఉన్నాయా?

అని తన తర్జని తో గాలి లో ఒక చతురస్రాకార సూచన చేసింది.   ఆ చతురస్రాకారం ఒక తెర  అయి వారికి ఒక దృశ్యం గోచరించింది.
===================================

అది అనంతపురం జిల్లాలో ఒక మారు మూల పల్లె.  ఒక పది పదిహేను మంది స్త్రీలు తమ పిల్లలకి పాలిచ్చి చెట్లకి చీరతో కట్టిన ఉయ్యాల లో పసి బిడ్డను వేసి, ఇంకొక ద్రవమును రెండు చెమ్చాలతో పట్టించి కాస్సేపు ఉయ్యాల ఊపి బిడ్డ నిద్రపోయాక పొలం పనులకు వెళుతున్నారు.

"వారు బిడ్డలకి చెంచా తో పట్టించింది ఏమిటో తెలుసా? "

తెలీదన్నట్టుగా తలాడించారు వేదికపై వక్తలు.

"అది విప్ప సారా , ఆ తల్లులు పనికి వెళితే ఆ బిడ్డని చూడడానికి ఇంట్లో ఎవరూ లేరు . బిడ్డ మెలకువగా ఉంటే  ఏడుస్తుందని,  ఎవరైనా చూడాల్సి వస్తుందని,  బిడ్డని చూడడానికి ఎవరూ లేరు అని ఆ బిడ్డ కి విప్ప సారా పట్టిస్తున్నారు. ఒక సారి విప్ప సారా పట్టిస్తే ఆ మత్తులో  ఇక బిడ్డ ఏడూ ఎనిమిది గంటల పాటు లేవదు.  తల్లి నిశ్చంతగా పని చేసుకోవచ్చు. కాకపొతే బిడ్డకి మలమూత్రాలు వస్తే అలాగే వాటితోనే నిద్రపోతుంది. ఏ తల్లీ తన బిడ్డని ఇలా పెంచాలని కోరుకోదు.  కానీ ఈ తల్లులకు వేరే దారి లేదు.  తరతరాలుగా ఇదే వారి జీవన విధానం.  తల్లి పనికి వెళ్లకపోతే బిడ్డ పోషణ జరగదు.  పనికి వెళితే బిడ్డ ఆలనా పాలనా చూసుకోలేదు చూడడానికి వేరే వారు లేరు.  ఆ లేత వయసులో ఆ విప్ప సారా బిడ్డలకి హానికరం. కానీ వారికీ వేరే మార్గం లేదు."

ఒక్క సారి ఆ ప్రాంగణమంతా నిశ్శబ్దం.

ఇప్పుడు ఇంకొక సమస్య చూడండి.

తెరపైన ఇంకొక దృశ్యం...

ఉత్తరప్రదేశ్ లో ఒక గ్రామం.  గ్రామం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల .   ఆరోజు పాఠశాల తనిఖీ కి డిస్ట్రిక్ట్ సూపెర్నెంట్ , DEO వచ్చారు.  పాఠశాల లో ఏటేటా విద్యార్థుల సంఖ్యా గణనీయంగా తగ్గిపోతోందని అందునా ఎనిమిదవ తరగతి నుంచి అమ్మాయిలు స్కూల్ విడిచివెళ్లిపోతున్నారని, ఇలానే కొనసాగితే స్కూల్ మూసేసి, టీచర్స్ ని ఉద్యోగాలు లాగేసి ఇళ్ళకి పంపిస్తామని DEO గారు ప్రిన్సిపాల్ మీద మండిపుతుతున్నారు..  మహిళా ప్రిన్సిపాల్ తమ పాఠశాల కి కొన్ని సమస్యలు ఉన్నాయని అవి వారితో కాక మహిళా సూపెర్నెంట్ గారి తో గోప్యంగా విన్నవించుకుంటానని ఆమెని పక్క గదిలోకి తీసుకువెళ్లారు.
మేడం  , మా స్కూల్ లో అమ్మాయిలకి వేరే టాయిలెట్ లేదు.  ఉన్న ఒక్క టాయిలెట్ కి తలుపు కూడా లేదు.  అమ్మాయిలూ టాయిలెట్ కి వెళ్లాలంటే గుంపు గా వెళ్ళాలి.  ఒక అమ్మాయి లోపలకి వెళితే మిగిలిన వారు తలుపుల అడ్డుగా నిలబడాలి.  చిన్నప్పుడు వారికి వారు అమ్మాయిలమనే తేడా తెలీదు. పట్టించుకోరు. కానీ తగిన వయసు రాగానే తెలుస్తుంది కదా.  వారి శరీరం లో వచ్చే సహజమైన మార్పులు, వాటి గురించి చెప్పే జ్ఞానం లేని తల్లితండ్రులు, కొరవడిన సదుపాయాలూ, వెరసి వాళ్ళు భయాందోళనలతో స్కూల్ మానేస్తున్నారు.  సదుపాయాలూ కావాలి మేడం, వారికి అవగాహన ఇచ్చే తల్లులు కావాలి,  ధైర్యం చెప్పే తండ్రులు కావాలి.  మార్పులని గురించి చెప్పే విద్య కావాలి.  ఇవన్నీ లేకే మేడం ఈ అమ్మాయిలకి పదకొండేళ్ళ రాగానే ఏడో  క్లాస్ తో స్కూల్ మానేసి వెళ్లిపోతున్నారు.   మార్పుని తట్టుకోలేక భయం తో అవమానంతో రెణ్ణెల్ల క్రితం ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందిమేడం  " అని వాపోయింది ప్రిన్సిపాల్.

సభలో అందరి మనసులూ భారం తో నిండిపోయాయి.

ఇంకొక దృశ్యం చూడండి.

రెండు నడి వయస్సు జంటలు కూర్చుని మాట్లాడుకుంటున్నాయి.   అప్పుడే ఒక పాతికేళ్ల కుర్రాడు బయటినుంచి వచ్చి వారికి నమస్కారం చేసాడు.

"బుజ్జీ నువ్వు నీ గదిలోకి వెళ్ళారా. మేము మాట్లాడుతూ ఉంటాము" చెప్పింది అతడి తల్లి ఒక నది వయస్సావిడ.

ఆ కుర్రాడు గదిలోకి వెళ్లి తలుపేసుకోగానే ఆమె మాట్లాడడం ప్రారంభించింది.

"చూడండి కల్యాణి గారూ  మీ అమ్మాయి సంబంధం మాకు నచ్చింది. అమ్మాయీ అబ్బాయీ ఒకరినొకరు నచ్చుకున్న్నారు. ఇక అంతా శుభమే. కాకపోతే కొంచెం మనం పద్ధతుల గురించీ కొంచెం మాట్లాడుకుందాము.   మా తరఫు వారు పెళ్లి కి రెండొందల మంది వస్తారు. అందులో సుమారు 30 మందికి ఫ్లైట్ టికెట్స్ మీరు ఇవ్వాలి. మా వారికి మేనత్త వరుస ఒక పెద్దావిడ పెళ్ళికి వస్తుంది.  మీరు ఆవిడని కాలు కింద పెట్టనివాకుండా VIP  లా చూసుకోవాలి. అమ్మాయికి బంగారం ఏమి పడదామనుకుంటున్నారూ? ఏమిటీ , 8 తులాల? ఆబ్బె 8 తులాలకి ఎవొస్తుందండీ? ఓ పాతిక తులాలైనా పెట్టండి.   లేకపోతె కనపడదు.  ఇక మీ ఇల్లు మీద  లోన్ ఉందా   ?  మీ అమ్మాయి ఏమైనా కడుతుందా ఆ EMI ? ఇలా అడిగానని ఏమీ అనుకోకండి.  అమ్మాయికి జీతం తో పాటూ అప్పులు ఏమున్నాయో కూడా మేము తెలుసుకోవాలి కదా? మీ అమ్మాయి జీతం నుండి. మీ రు మీద బ్యాంకు లో ఏమైనా డబ్బు వేస్తున్నారా?  ఏమిటీ 5 లక్షలా?  ఏమి సరిపోతాయండీ? వాడుకునేది వాళ్ళే కదా! ఒక పదిహేను లక్షలైనా వెయ్యండి.  ఏమిటో అన్నీ నేనే మాట్లాడేస్తున్నాను, ఇక మీరు చెప్పండి"

అది చూసిన అందరికీ ఆవేశం కట్టలు తెంచుకుంది.

తరువాత ఇంకొక దృశ్యం

నడివయసు స్త్రీ వంటింటి లో పని చేసుకుంటోంది.  ఆమె కుమార్తె వచ్చి " అమ్మా, రాత్రి ఫ్రెండ్ ఇంట్లో నైట్ స్టడీస్ చేస్తున్నాము. రేపు టెస్ట్ ఉంది. నా కోసం వెయిట్  చెయ్యకు. కాల్స్ మెసేజెస్  కూడా చెయ్యకు. " అంది.

"ఆడ పిల్లవి కాదమ్మా, అలా వేరే వాళ్ళింట్లో ఎందుకు పడుకోవడం? ఇంటికొచ్చేయ్యోచు గా "

"ఊరుకో అమ్మా, నేనేమి బయట తిరగడం లేదు కదా ? ఫ్రెండ్ ఇంట్లో నే కదా ఉంటున్నాను."

"మా రోజుల్లో ఇలా రాత్రిళ్ళు బయట ఉండనిచ్చేవారూరు కాదు.

" హమ్,మీ రోజులూ మీ చదువు?  నాటికి నేటికీ ఎంత తేడా ఉందమ్మా!   రోజుల్లో మీకు 35% మార్కులు వస్తే పాస్. ఇవ్వాళ ఏడాది మొత్తం వంద టెస్ట్ లు పాస్ అయితే గానీ గట్టెక్కడం లేదు.  ఆ రోజుల్లో డిగ్రీ పాస్ మార్క్ ఉంటె చాలు ఉద్యోగాలు, ఈ రోజుల్లో 99% ఉన్నా గారంటీ లేదు.  ఎందుకమ్మా  పోలుస్తావు? "సాగదీసింది అమ్మాయి. బాయ్ చెప్పి వెళ్ళిపోయింది.

ఆ వెంటనే ఆమె భర్త వచ్చాడు .

"ఏమోయ్, రాత్రి స్టాఫ్ తో డిన్నర్ ఉంది.  .  నా కోసం వెయిట్ చెయ్యకు.

అయ్యో, అదేంటండీ, మా కాలేజీ ఫ్రెండ్ గౌరీ వస్తుందని చెప్పాను కదండీ రెండ్రోజుల క్రితం.  అప్పుడు ఏమీ చెప్పలేదు మీరు.  బావుండదేమో?

ఎం బావుండదు? హెడ్ ఆఫీస్ స్టాఫ్ తో డిన్నర్ నాకు ముఖ్యం. ఇది నిన్న ఫిక్స్ అయింది.  ఎలాగోలా ఎర్లీ గా ముగించి 9 గంటలకి  వచ్చేస్తాలే. అయినా ఆఫీస్ ఒత్తిడి  ఇంపార్టెన్స్ నీకెలా తెలుస్తాయి. ? విసుక్కున్నాడు.

" హలో,నేను మీరు ఒకే కాలేజీ లో బి.టెక్ చదివాము. ప్రేమించి పెళ్లి చేసుకున్నాము.  పెళ్లవగానే నేను రెండేళ్లు జాబ్ కూడా చేసాను. పెద్దడి పుట్టాక పెంచడానికి రెండేళ్లు బ్రేక్ తీసుకుందామనుకుని ఉద్యోగం మానేసాను. ఆ తర్వాత చిన్నది పుట్టడం, మీ ట్రాన్సఫర్లూ, వాళ్ళ చదువులూ , సంసార బాధ్యతలు, వీటన్నిటితో నేను ఉద్యోగం  చేస్తే మన కుటుంబం ఇబ్బంది పడుతుందని నేను చెయ్యకుండా ఉన్నానే కానీ చదువు గురించీ , ఉద్యోగం గురించీ తెలియని దానను కాదు" నిష్టూరం గా అంది ఆమె.

"చూసారు కాదర్రా ఇప్పుడు చెప్పండి?  ఏవి పెద్ద సమస్యలు? మన మహిళా మండలులూ  ప్రభుత్వాలూ పరిష్కరించవలసిన సమస్యలు.

కోట్లకు పడగలెత్తిన ఒక నటీమణి మీద పరాయి మగాడు చెయ్యివేస్తె ఆమె ప్రపంచం లోనే అత్యున్నతమైన న్యాయవాదులను పెట్టుకుని తన హక్కులని పరిరక్షించుకోగలదు .  ఆమె కి "మేము సైతం " అంటూ ఉద్యమ బలం అవసరం లేదు.

కార్పొరేట్ బోర్డు రూమ్ లో స్త్రీ పురుషల సంఖ్యా సమానమయితే అప్పటికే హోదాలో ఉన్న ఏ కొద్దీ మంది మహిళలకు ప్రయోజనం కోరుతుంది.

కానీ మచ్చుకి  చూసారు కదా, స్త్రీ జాతి కి బాల్యం  నుంచి ఎన్ని సమస్యలో?

ఆ పసిబిడ్డల తల్లులకు మేము సైతం అని మీరు  అండనివ్వాలి. ప్రతి స్త్రీ ఒక తల్లి కి జన్మనిస్తుందంటారు.  ఆ పసి పిల్లలకి తల్లి లాంటి ఆలనా కావాలి.

కనీస సదుపాయాలూ లేక సిగ్గు, భయం తో స్కూల్ మానేస్తున్న ఆ కన్నె పిల్లలకు సదుపాయాలూ, కనీస  సౌకర్యాలూ , అవగాహణనిచ్చి, భయం ఆందోళన పోగొట్టే తల్లులు కావాలి.

ఈ 21 శతాబ్దం లో వరకట్నం సమస్య మాసిపోయిందని ఒక పక్క సంబర పడుతూ ఉంటె, ఇంకొక పక్క రాజుకుంటున్న మంటలా కట్న కానుకలు ఏమిటని ప్రశ్నించే గొంతులు కావాలి.

అన్నీ ఉండి  కుటుంబం కోసం ప్రతిభ ని త్యాగం చేసిన మాతృ మూర్తిని అంతా నీకేం తెలుసనీ ప్రశ్నిస్తుంటే ఆమెకేం తెలుసో చెప్పే సమధానం కావాలి.

ఇది మీరంతా చెయ్యాలి.

లక్ష్మీ దేవి ప్రాంగణమంతా ఒక సారి చూసింది. ఎవరైనా ఏమైనా మాట్లాడతారేమో

అని. వేదిక మీద ఒక వక్త  అడిగింది.

"వీటన్నిటికీ కారణం  మఙ్గజాతే. వారు మమ్మల్ని బలహీనులా చూడడం వల్లే ఇన్ని సమస్యలు.  ఈ పురుషాహంకారం తగ్గాలి.  అదే మా ఉద్యమం "

లక్ష్మీ దేవి చిరునవ్వు నవ్వి తెరవైపు చూడమన్నట్టుగా సైగ చేసింది.

తెరపై ఇంకిక దృశ్యం...
===============================
బహుశా కొన్ని వేల సంవత్సరాల  క్రితం.  అప్పటికింకా మానవుడు ఆది మానవుడు.  నాగరికత వైపు నడకలు వెయ్యలేదు. భాష కూడా పుట్టాలేదు.

ఒక ఆది మానవుడు  ఆమెని పిల్లలని తీసుకుని గుహలోకి వెళ్లిపొమ్మని తానూ బయటే ఉంటానని సైగ చేసాడు.

ఆమె వద్దు వద్దు మేమూ బయట ఉంటాము లేదా నువ్వు కూడా లోపలికి వచ్చెయ్యమని సైగ చేసింది.

అతడు వారించాడు. బలవంతం గా ఆమె ని పిల్లలనీ గుహలోకి పంపించాడు. ఆమె అయిష్టంగా వెళ్ళింది పిల్లలతో..

అతడు గుహ బయటనే రాతి మీద నిదురించాడు.

చీకటి పడింది.  అతడు రాతి మీద కూర్చునే చురుకుగా అన్ని పక్కలా చూస్తున్నాడు ఏమైనా ఆపద వస్తుందేమో అని.

అంతలోనే ....పులి గర్జన వినపడింది.  అతడు బరికె  తీసుకుని అప్రమత్తంయి కాళ్ళు ఎడంగా పెట్టి అన్ని దిక్కు లా చూస్తున్నాడు.  మెరుపులా అతడి మీదకి దూకింది పెద్ద పులి.  అతడు సిద్ధంగానే  ఉన్నాడు.  చేతులతో, కాళ్ళ తో, బరికెతో, తలతో ముష్టి ఘాతాలతో యుద్ధం చేసాడు. గుహకి పది అడుగుల దూరం దాటి రాకుండా పులిని కట్టడి చేసాడు. చివరకి పులిని చంపి తానూ నేలకొరిగాడు.

తెర  మీద దృశ్యం ముగిసింది.

లక్ష్మీ దేవి కొనసాగించింది.

"చూసారు కదా, ఏ నాగకారికతా ఎరుగని రోజుల్లో పురుషుడికి రెండే భాద్యతలు ఉండేవి - పోషణ, రక్షణ.  కానీ నాగరికత పెరిగాక ఎన్నో భాద్యతలు.  అన్నిటా  సరితూగలే కపోవడం మొత్తం మానవాళికే కష్టం గా ఉంది ఈ నాగరిక జీవనం లో. అయినా ఏ స్త్రీ దృష్టి లో తన భర్త, తండ్రీ, అన్న, తమ్ముడూ, కొడుకూ చెడ్డవాడు కాదు. మరి మగజాతి మొత్తం చెడ్డది ఎలా అవుతుంది? బియ్యం లో రాళ్లు వస్తే ఏరి పారేస్తాము కానీ బియ్యాన్ని వదిలేసి పస్తులుంటామా ?

భిన్నత్వం కంటే సమానత్వం  గొప్పది. సమానత్వం కంటే ఏకత్వం గొప్పది.   మగవాడు మీ పూర్ణ బలం. ఆ శక్తీ ని వదిలేసి మీరు దీర్ఘ కాలం ఒంటరి పోరాటం చేస్తారా? ఆ బలాన్ని కలుపుకుని మీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తారా? ఇన్నాళ్లూ  దేన్నయితే సమస్య అనుకున్నారో ఇప్పుడు అందులోనే పరిష్కారాన్ని చూడండి.  ఇదే నేను మీకు ఇచ్చే సందేశం. "

అని చెప్ప్పి లక్ష్మీయే దేవి వచ్చిన దారినే వెళ్లి అంతర్ధానం అయింది.

===========

ఏమిటోయ్, అనంతపురం కి రెండు బస్సు టికెట్స్ బుక్ చేసావు? నాకు బస్సు బుకింగ్ అప్ నుంచి టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. నువ్వూ మీ మహిళా మండలి ఫ్రెండూ వెళ్తున్నారా ?  అడిగాడు ప్రకాశం భార్య సుమతి ని.

"నేనూ మా మహిళా మండలి ఫ్రెండూ కాదు, ఫర్ ఆ చేంజ్, నేనూ మీరూ వెళ్తున్నాము ". నవ్వింది సుమతి.

"ఆమ్మో నేనా? ఆ "మీ టూ" ఉద్యమాలలో నన్ను కలపకు " భయం గా అన్నాడు.

"ఇది మీటూ కాదు.  we టూ అని ఒక కొత్త ఉద్యమం.   అనంతపురం జిల్లా లో ముక్కు పచ్చలారని పసి పిల్లలకి తల్లులకు కొంచెం సహాయం కావాలట.  మీకు నచ్చే పనే లెండి. " సమాధానపరిచింది సుమతి.


==========================

రచయిత వాక్కు:

ఇంతకూ సుమతి ఎవరో చెప్పనే లేదు కదూ! నిన్న మహిళా సమావేశం లో ఆఖరి వరుస లో ఆఖరి సీటు లో కూర్చున్న ప్రేక్షకురాలు.

ఇక్కడ సుమతి ప్రకాశం ల మధ్య ఈ చర్చ జరుగుతున్నప్పుడే కొన్ని వందలమంది మహిళలు అంతర్జాలం లో తమకు తెలియని అరుదైన స్త్రీ సమస్యల గురించి శోధిస్తున్నారు.

ఉద్యమ లక్షణం ఇదే - ముందు  నిశ్శబ్దంగా పిల్ల కాలువలా పారుతుంది. తరువాత సునామీ లా తిరగబడుతుంది   కాకపొతే ఈ సారి సునామీ విధ్వంసం   సృష్టించదు. విశ్వ కళ్యాణం జరిపిస్తుంది.

ఇంతకూ నన్ను కలుపుకుని we టూ ఉద్యమం ప్రారంభించామని సలహా ఇచ్చిందెవరో? " కుతూహలం గా అడిగాడు ప్రకాశం.

"ఒక పెద్దావిడ" అని దేవుడి గది   వైపు తిరిగి ఆ దిక్కుని చేతులతోనే మూడు సార్లు కళ్ళకద్దుకుని నమస్కారం చేసింది సుమతి.

 (సమాప్తం )

మా ఇంట సంక్రాంతి - రెండవ భాగం

ఇది మా చిన్న నాటి విజయనగరం లో మా తాత గారింట్లో సంక్రాంతిపండుగ జ్ఞాపకాల నుండి తవ్వి తీసిన కొన్ని రతనాలు
రెండవ భాగం
పండగ మామూళ్లు :
పెద్ద పండగ లో పండగ మామూళ్లు ఒక పెద్ద సంస్కృతీ.  పండగదగ్గరకొస్తోందంటే ఎవరెవరో ఆగంతకులు "అమ్మాపండగ మామూళ్లుఇవ్వండమ్మా!" అని గుమ్మం లో  నిలబడతారు.  సుపరిచుతులుకొందరు కొంచెం తెలిసీ తెలియని మొహాలు.   లేదు.  మామూళ్లువెంటనే ఇచ్చి పంపించేస్తారు.  అసలు చిక్కంతా అస్సలు పరిచయం లేనికొత్త మొహాల తోనే. "నిన్నెప్పుడూ చూడలేదేనువ్వు మా ఇంట్లో ఏమిపని చేసావని మామూలు  ఇవ్వాలని?" మా పెద్దవాళ్ళు అడుగుతారు.  అల్లా అడగ్గానే "ఎప్పుడో తేలు మంత్రం వేసామనోప్రశ్న చెప్పామనోకారాలు దంచామనో సర్ది చెప్పి మామూలు  తీసుకుని  వెళ్ళిపోతారు 
మామూళ్లు కోసం ఒక 40 మంది వచ్చి వెళ్లడం మా ఇంట్లో షరామామూలే
పేకాటలు
ఇక పండగ కీ పేకాటకి ఉన్న పడుగూ పేక కి ఉన్న బంధం లాంటిదిపండుగలలో పేకాట ఒక పిల్ల కాలువ లా మొదలవుతుంది.  అప్పుడేమూతి మీద మీసాలు మొలిచిన ఒక కుర్ర కుంక పండగలో ఆడడానికానికొన్ని రోజుల ముందే ఒక రెండు దస్తాలు పీకలు కొనుక్కుని వస్తాడు.
"పేకాటలు పండగ ఒక్క రోజు నాడే ఆడాల్రోయ్అప్పుడే పేకాటలుమొదలెట్టేయకండి " పెద్దలనుంచి వార్నింగ్  వొస్తుంది
"ఆబ్బెఆడట్లేదు.  క్రొత్త పేకలు  కదాకొంచెం కోత వేస్తె ముక్కలుజారకుండా ఉంటాయి.  కోత వేసి దాచేస్తాం." అని చెప్తాడు కుర్ర కుంక.  
బుద్దిగా ఒక మూల కూర్చునిపేక దస్తాలు విప్పి తన ఒంటి చేతికే పక్కలేని మరొక చేతికి ముక్క్కలు పంచి కలిపెయ్య బోతాడు
అప్పుడే వస్తాడు ఒక మేన మామో , మేన బావో .   "అలా పంచినముక్కలు కలిపెయ్యకోయే.   అవి పేక ముక్కలను అవమానపరచడం.  ముక్కలు పంచినందుకు ఆడేసి కలిపెయ్యాలి " అని కూర్చుని  రెండోచేతి ముక్కలని తన చేతిలోకి తీసుకుని ఇద్దరూ ఆడడంమొదలెడతారుఇంకొకాట , ఇంకోకాట అను రెండు మూడు కలుపులుకలుతారుఇంతట్లో మరో మూడో మనిషొస్తాడు.  "ఏమిటోయ్కొత్తపేకలు కోతకొచ్చాయా?" అదేదో పంటలు కోతకు వచ్చాయా అన్న రేంజ్ లోఅడిగి ఆటలో చేరుతాడు.  అలా నాలుగో మనిషిఇలా ఆటగాళ్ల సంఖ్యపెరిగి 15-20 కు చేరేది
అలా పండగ కి వారం రోజుల ముందే పిల్లకాలవలా మొదలయినపేకాటఉద్యమం ఊపు అందుకుంటుంది.  ఎంత ఊపంటేబోగి నాడుబోగి మంటలకి అందరూ నిద్ర లేస్తేపేకాటరాయుళ్ల మాత్రంనిద్రలేవక్కరలేకుండానే రాత్రంతా ఆడుతున్న పేక పక్కన పడేసి బోగిమంటల దగ్గరకి వెళ్లేంత.
కొన్ని ఇళ్లలో  పాత పేక దస్తాలను బోగి మంటలలో పడేసికొత్త పేక కోతవేసే సాంప్రదాయం కూడా ఉంది 
ఒక్కొక్క సారి సంక్రాంతి కి మొదలయిన పేకాట జైత్ర యాత్ర లా ఫిబ్రవరిమార్చ్ ఏప్రిల్ లో జరిగే పెళ్లిళ్ల వరకూ కొనసాగిన గురుతు కూడా ఉంది.   ఇక ఎక్కువ సేపు పేకాట రికార్డు గురించి చెప్పాలంటేఒక గుంపునాలుగు రోజులు పగలూ రాత్రీ కదలకుండా పేకాడిన వైనం కూడా ఉంది
సినిమాలు:
పండగలు కొత్త సినిమాలని తెస్తాయాకొత్త సినిమాలు పండగలనితెస్తాయా అంటే విడదీసి చెప్పడం కష్టం.  పండగ వాతావరణాన్నిపదిమందీ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకా అన్నట్టుపండగల లో కొత్త సినిమాలు రిలీజ్  అవ్వడం,మా ఇంటి నుంచి 40 50 మంది వరకూ 10-15  రిక్షాలు వరుసగా కట్టించుకుని తరలి వెళ్లడంరివాజు.  ఇంటి దగ్గర కంటేఇంటికి దూరం గా ఉన్న థియేటర్ కి వెళ్లడంలో ఒక కిక్కు ఉంది.  అప్పుడైతే రిక్షా ఎక్కొచ్చుమధ్య లో కూల్ డ్రింక్ఉప్పో కారం వేసి వేయించిన జీడిపప్పు పాకేజ్ తో పండగ లో చూసేఎంత చెత్త సినిమా అయినా అదో గొప్ప 
వంటలుపిండి వంటలు
ఇంట్లో ఉన్న 60 మందిబయట నుండి వచ్చి పోయే వారితో కలిపిసుమారు 100 మందికి పండగ భోజనాల కోసం మా తాత గారింట్లో ప్రతీశుభ కార్యానికి వంట బ్రాహ్మణులు వచ్చేవారు.  ఈరోజు వంట చేయాలో రోజుకు ముందు రోజు రాత్రే వచ్చేసేవారు.  కనీసం 3-4 వంట బ్రాహ్మణులువచ్చేవారు.  మా ఇంట్లో పెద్ద పాత్రలు గంగాళాలు ఉన్నావంటబ్రాహ్మణులు వారి పాత్రలుగరిటెలు తెచ్చుకునేవారు.  వారికి అలవాటైనపాత్రలతో సులువుగా వుంటుందనే వారు.  తెల్లవారు జామునే 3-4 గంటలకి లేచి స్నానాలు చేసికూరలు తరగడం తో వంటలు మొదలుపెట్టేవారు.  వాతావరణాన్ని బట్టి పైకప్పు లేని మండువా లోగిలి లో గాని,  వంటింటి వెనుక ఉన్న గదిలో కానీ వంటలు చేసేవారు.  వంటలు వండేపరిసర ప్రాంతాలకు ఎవరూముఖ్యం గా పిల్లలూకుక్కలుపిల్లులూరాకుండా ఉండడానికి గట్టి బందోబస్తు చేసేవారు.  వంట వారిలో ఎవరోఒకరు ఎప్పుడూ ఎవరూ దగ్గరకు రాకుండా అప్రమత్తం గా ఒకకన్నేసుంచేవారు
పొద్దున్న 9 గంటలకల్లా వేడి ఫలహారాలుగిన్నె డికాషన్ కాఫీ సిద్ధంచేసేసేవారు.  లేత అరిటాకులో వేసిన వేడి ఉప్మా కి అరిటాకు నల్లగాకమిలిపోయి ఉప్మా మరింత రుచిని పొందడం ఒక గొప్ప జ్ఞాపకం
మధ్యాహ్నం 12 గంటల కల్లా వేడి భోజనాలు సిద్ధం చేసేవారు.  అంతసేపు వంట చేసి అలసిపోయినా కూడా,  వంట బ్రాహ్మణులూఅత్యోత్సాహంతో వడి గా నడుస్తూ అందర్నీ పలకరిస్తూచిరునవ్వుతోవడ్డించేవారు.  వడ్డిస్తూవారు వడ్డిస్తున్న వంటకం పేరు ని పదే  "అన్నంఅన్నంఅన్నం",   "పప్పుపప్పుపప్పు", వొడియాలువొడియాలువొడియాలుఅని ప్రకటిస్తూ వడ్డించేవారు.  పోనీ వారు ముందుతిన్నారా అంటేఅందరికీ వడ్డిస్తే కానీ తినేవారు కాదుఅయినాఉత్సాహంగా హుషారు గా ఉండేవారు
అప్పటికే నెల రోజులు పండగ వాతావరణం ఉన్నాఎప్పుడువెళ్లిపోతున్నారో తెలియకుండా బంధువులందరూ ఒక్కొక్కరూ రిక్షాకట్టించుకుని బస్సు స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి ప్రయాణాలు కట్టేస్తూఉంటారు.   చూస్తుండగా ఇల్లు బోసి పోయి 60 నుంచి 20 మందికిదిగిపోతుంది.  మళ్ళీ మరో శుభ కార్యానికి మెల్లిగా పుంజుకుంటూఉంటుంది.  
సంక్రాంతి పండగ అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే.  తేడా అల్లా పదిమందికలవడం లో ఉందికలవాలని తపించే మనసులోనే నిజమైన పండగఉంటుంది
(సంపూర్ణం)