12, మే 2017, శుక్రవారం

పద్యాల తో "రణం": ఎనిమిదవ భాగం

"పగలే నిశిమయ్యే ననగ వగపులు కలుగన్" - కులశేఖర రావు మడుపు

1) సాయి సోమయాజుల

తెగ పెంచిన నల్ల ధనము తో
ధగ ధగ మని మెరిసేనొకడు
భగ భగ మని మండే నిపుడు
పగలే నిశిమయ్యే వగపులు కలుగన్

2) మధుబాల కరవది

ప్రక్రుతి భీకరమై గర్జించిన వేళ
ఆదరించే నేల కంపించి కొపించిన వేళ
సముద్రాలు సునామిలుగ చెలరేగిన వేళ
పగలే నిశిమయ్యే ననగ వగపులు కలుగన్

3) శేషు అప్పారావు

వెలవెల బోయె వృక్షవాటికలు ఆ మంచు తెరలో

వలస బోయె నెచటికో ఆ గువ్వల జంటల బారులు

ఆదిత్యుడస్తమించె హంగైన సమయాన పశ్చామాద్రిన్

పగలే నిశిమయ్యే వగపులు కలుగన్

4) సావన్ సోమయాజుల

దక్షుని ఇంట దాక్షాయని దహించుకుపోయేనని


దక్షిణా మూర్తికిన్ తెలియగనే యాతను తృతీ


యాక్షువున్ తెరచె నా విపరీత భయాన


క క్షణమున పగలే నిశిమయ్యే ననగ వగపులు కలుగన్

పద్యాల తో "రణం": ఏడవ భాగం

"చెలిమిన నిజపతి కోరమనగ, వనిత చేటును కోరెన్"

1) సాయిరాం పోగులూరు

లక్ష్మీ పూజ వేళలో వజ్ర వైఢూర్య హారముల్
చెలిమిన నిజపతి కోరమనగా , వనిత చేటున్ కోరెన్
వస్త్ర , భూషణ సౌందర్య రాసా పోషణా విలాసముల
కోరె మంజులమున ఇరువురి ఎద మంజిష్టా రాగము

2) సాయి సోమయాజుల

ఒకపరి కాంచన హారిణిన్ గోరి కాముకుని చెరను చేరేన్ వే
రొకపరి ఆశ్రమ జీవనంబును గోరి శాశ్వత వియోగంబు పట్టె జా
నకి, అది ఏమి జన్మ రహస్యమో గాని
అకటా ఎప్పుడు చెలిమిన       నిజపతి కోరమనగా పడతి చేటును కోరెన్

3) మధుబాల కరవది

చెలిమిన నిజపతి కోరమనగ,
వనిత చేటును కోరెన్
ఇదియే పురుషార్ధ  ధర్మంబు తెలుపు
రామాయణ మహా కావ్యమై నిలిచె
మానవాళి   ప్రయోజనార్ధమై
ఇది నిక్కము, సధర్ముల చేటుయు చేయు మేలు  జానావళికిన్  

4) 3విక్రమ్ సింగరాజు

వలపులు రక్కసికైనఁ బుట్టింపు రూపమో పురుషునది, జా
లిలేక ముఖాంగములు కోసిపంపు  క్షాత్రమ్మరో గండుది, పలు
కులొలికెత్తుకెళ్లు కుళ్లోమగానిదైన, నింద న్యాయమా స్త్రీపై
"చెలిమి నిజపతి కోర్మనగ, వనిత చేటును కోరెనంచు?"

5) శేషు అప్పారావు

చెలిమిన నిజపతి కోరమనగ, వనిత చేటును కోరెన్
లోక కళ్యాణము  లావణ్యవతి లక్ష్యము కాగా
పుడమిన చేసెను పతిని ప్రత్యక్ష  దైవము పడతి
ఔరా ఇలను  ఇంతిని మెచ్చరే ఈ పురుష పుంగవులు

6) హనుమంత రావు కరవది

రమ్మాయని రాముడు జాంభవంతుని పిలచి
కొమ్మా నీ కొక కోర్కె  తీర్చదన్న
రమ్మా నాతో ముష్టి యుధ్దముకనె
చెలిమిన నిజపతి కోరమనగ,
వనిత చేటును కోరెన్

పద్యాల తో "రణం": ఆరవ భాగం

"ఆ పిచ్చి వాడు ట్రంపు" - అప్పారావు

1) సాయి సోమయాజుల

అమెరికన్లు పలుకు ఆడంబరముగాను
భారతీయులు పలుకు చల్లగాను
ట్రంపు మోగినట్టు మన్మోహను  మోగునా
శారదాంబ పలుకు శాయి మేలుకొలుపు

దేశమును ప్రేమించుమన్నా
అన్న గురజాడ వారి అడుగు జాడలలో
కదులుతున్న దేశ ప్రేమికుడు
పాపం పిచ్చివాడు మన ట్రంపు

2) రమేష్ వేమూరి

ఆ పిచ్చి వాడు ట్రంపు
ఆ పై వాడి నోరు కంపు
ఆపమన్నచో వాడితో తంపు
విశ్వదాభిరామ వినుర వేము

3) మధుబాల కరవది

ఆ పిచ్చి వాడు ట్రంపు
ట్వీట్ ట్వీట్ అంటూ చంపు
ఒట్టి మాటలే కాని చేతలుండునా
విశ్వధాభి రామ వినుర హనుమ

ఆ పిచ్చి వాడు ట్రంపు
మాటలతో అందర్ని చంపు
మాటలకి చేతలకి లేదు సొంపు
ఆబ్బా! వీడి చేతలన్నీ కంపు కంపు

4) సత్యం పోతంశెట్టి

ఆడసొంపు కనిపిస్తే అతుక్కొనే కంపు,
మెక్సికన్లు రేపిస్టులు పోటీ వద్దు, పంపు

నల్లవాళ్ళు ప్రమాదం, గన్నులిచ్చి చంపు

చైనావాళ్ళ వ్యాపారం మనకో పెద్ద బంపు,
మరి చేసేసెయ్ వాళ్ళతో ఇంక నువ్వు తెగదెంపు

కాలుష్యం ఓ జోకని నిధులన్నీ తుంపు
బొగ్గు గనులు తెరిచేసి శ్రామికులను దింపు

లెక్కలడిగినోళ్ళమీద ఒంటికాలితో జంపు
నిన్ను పొగడే వాళ్ళ మీదే నీకు మరీ ఇంపు

ప్రతిక్షణం తన గురించి ట్విట్టర్లో దంపు
తేరిపార చూస్తే, ఆ పిచ్చివాడు ట్రంపు

5) 3విక్రమ్ సింగరాజు

ఆపిచ్చువాడు ట్రమ్పు గోడదూకొచ్చు ముచ్చులను
అప్పిచ్చువాడు ట్రమ్పు గడ్డపై భృత్యకల్పనాకాంక్షులకు  
అపి చివాట్ల వాడు ట్రమ్పు రాజకీయ నిరుద్యోగులకు
ఆ పిచ్చివాడు ట్రమ్పు దేశ ప్రయోజనా చింతన కల్గినందుకున్?

ట్రంపు నొకటి తెఛ్చి కొత్త పట్టము గట్టి
రిపబ్లికను లెల్ల గొలిచినట్లు
వెర్రి వాని నొద్ద వెంగళప్పలుందురు
వినుడు భారతీయ వీరసుతుడా

6)  హనుమంతరావు కరవది

ట్రంప్ నొకటి తెచ్చి ఎంతంత  వూదిన ట్వీట్ ట్వీటే గాని మాట రాదు
 పిట్ట కూతల కన్న మన మోడి మౌనమే మిన్నరా
విశ్వ సత్యమిదియె వినుర హనుమ!


పద్యాల తో "రణం": ఐదవ భాగం

"జడ పదార్ధములతో మాట్లాడగ వచ్చుఁనె" - రమేష్ వేమూరి

1) మధుబాల కరవది

చూడ ముచ్చటైన జడ, పూల జడ
ముద్దుగా కలికి నడుముల కులుకు జడ
చూచి మెచ్చి మురువ వలెగాని, నరుడా  
జడ పదార్దములతో మాట్లడ వచ్చునే

2) 3విక్రమ్ సింగరాజు

దడ పుట్ట బుసకొట్టు చెవుచుట్టు నసపెట్టు, ఎడాపెడా జగడముతో
గడగడ వణికించు పడతులతో - తొడగొట్టి తలపడి మెడలువంచుట,
ఉడుము పిడికిళ్లు విప్పుట, పుడమంత కుడుము మింగచూడుట
కడలి సుడుల - మోసలి మడుగుల అడుగిడుటయేనని యెరిగి మూత
పడ్డ నానోరు, మరుల జడ పదార్ధములతో మాటలాడగ వచ్చునే?

3) సాయి సోమయాజుల

నేను ఊటీ యనగ తాను ఉడిపి యనియె
నేను గోవా యనగ తాను కోవెల యనియె
నేను మూవీ యనగ తాను మూగ నోమనియె
ఇట్టి జడ పదార్ధములతో మాట్లాడవచ్చునే

4) శేషు అప్పారావు

ముచ్చటగ మూడు మాటలనడు  సతితో
పాక శాస్త్ర ప్రావీణ్యము సున్న రుచుల ప్రస్తావన మిన్న
మహి నేలు అర్ధాంగికి అండగా నిలబడడు
మరుల జడ పదార్ధములతో మాటలాడగ వచ్చునే?

5) గీత దేసు

కొత్త పెళ్ళాం బెల్లమనెను, ఏమి వండినను లొట్టలేసేను
నువ్వే నా రాణి వనెను, ఏమి చేసినా ముద్దు గొలిపెను  
రెండు నాళ్ళకే  పాతదయ్యెను, ఏమి పలికినా జగడ మనెను
ఒక్క పనికే అలుపు అనెను, ఎంత కోరినా ఒల్లకుండెను
వామ్మో , జడ పదార్ధములతో మాటలాడగ వచ్చునే ?

6) కులశేఖర మడుపు

గడబిడ జరిగిన శీలము
జడమై పోయె నహల్య, శక్తులు పొయే
అడుగులు రాముని సోకగ
జడ పదార్ధములతోడ మాటలువచ్చెన్

7) రమేష్ వేమూరి

"కుదిరితే కప్పు కాఫీ, వీలైతే నాలుగు మాటలు వీడి
కాలక్షేపపు కబుర్లు, మధురమైన సంభాషణలు వదిలి
చరవాణి చేతబట్టి మూగబోయిన సమకాలీన
'జడ' పదార్ధములతో మాట్లాడగ వచ్చుఁనే"

పద్యాల తో "రణం": నాల్గవ భాగం

"ఊరకరారు మహానుభావులు ఉగాది కవిత తోడుగ వచ్చెన్" - సాయి సోమయాజుల

1) రమేష్ వేమూరి

క్రొత్త ఆశలతో దుర్ముఖికి వీడ్కోలు చెప్పెన్
మామిడి చిగుళ్లతో కోయిల కూతలు వచ్చెన్
ఉగాది షడ్రుచులతో హేవిళంబి వచ్చెన్
ఊరక రారు మహానుభావులు ఉగాది తోడుగ వచ్చెన్

2) 3విక్రమ్ సింగరాజు

ఊరికే అందాలు ఒలకపోసే వెన్నెలలు, కనుల
కూరటకలిగించే పచ్చటి చిగుళ్లు
ఉరకలు వేసే యెడ్లు, వాటి బండ్ల నిండా ఒడ్లూ, గండు కోకిళ్ల
సరాగాలు, నిండు వసంతం కొమ్మనమామిళ్ళు- రమ్మన,
ఊరకరారు మహానుభావులు ఉగాది కవిత తోడుగ వచ్చెన్

ఊరకుండరు ఉరుకులెడతారు, ఊరమెరపల్లా కయ్యిమంటారు,
ఉల్కముక్కల్లా ఉరిమి పడతారు,  ఊరకుక్కల్లా మొరుగుచుంటారు,
ఊయల జడలతో ఉరిబిగిస్తారు, ఊరువులతో ఉప్మాచేసి ఉదరపాకలి బాపమంటే, తీరికలేదు
ఊరటకు సద్దిగిన్నెలూడ్చమంటారు, అన్నన్నా అట్టి ఆడవారు నేడు  
ఊరకరారు మహానుభావులు ఉగాది కవిత తోడుగ ఎటుల వచ్చెన్?

3) 

పద్యాల తో "రణం": మూడవ భాగం

"'జోడు గుఱ్ఱముల స్వారీ చేయ తగునా " - రమేష్ వేమూరి

1) సాయి ప్రసాద్ సోమయాజుల

ఆగని మాయా మోహ జగమొక వైపు
సాగని ఆధ్యాత్మిక యాత్ర వేరొక వైపు
జగమున నీకు అగచాట్లు తప్పవా నాయనా
జోడు గుఱ్ఱముల స్వారీ చేయ దగునా

2) 3విక్రమ్ సింగరాజు

జోడుచ్చుక్కోట్టే దొకటి, మంచం కోడుక్కటేసేదొకటి
మాడు పగలాదీయునొకటి, తలలు బోడులు చేయునొకటి, చెలి
కాడు వేంకన్నకు చెల్లునేమోగాని, రెండు పడవలపై  కాళ్లూ
జోడు గుఱ్ఱముల స్వారీ, చేయదగునా అల్ప విక్రమునకున్?

3) మధుబాల కరవది

ఇంట సాద్వీమణి వోలే
బయట  ఝన్సీ రాణి వోలే
ఇంటా బయటా  గెలుచుటకై నేటి నారి
జోడు గుర్రముల స్వారీ చేయ తగునే

జోడు గుర్రముల స్వారీ చేయ తగునా అని
ఔర! నవ నారిమణిని అడుగుట తగునా
నేటి నారి ఇంటా బయటా గెలవాలంటే
జోడు కాదు మెండు గుర్రముల స్వారీ చేయవలె

4) కులశేఖర మడుపు

రెండు  భాషలు మెండుగా చదివి
పండితు లైన  పడుచున్న
పద్య రచనలు భారమా?
జోడు గుఱ్ఱముల స్వారీ చేయవచ్చు

5) గీత దేసు

అమెరికా హంగు బొంగులు ఒక వైపు 
భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు మరియొక వైపు 
సాకర్ ముఖ్యమా కూచిపూడి ముఖ్యమా అని తికమక పడుతున్న తల్లిదండ్రులు 
ఈ జోడు గుఱ్ఱముల స్వారీ చేయదగునా !

5)రమేష్ వేమూరి

జోడెద్దుల వ్యవసాయము చేయవచ్చు, సాలుకు
జోడు ఫసల ఫలసాయము నందవచ్చు, మరల
జోడు సతుల పెరుమాళ్ళ త(కొ)లచవచ్చు, అంత
జోడు గుఱ్ఱముల స్వారీ చేయదగునా