23, జనవరి 2020, గురువారం

మా ఇంట సంక్రాంతి - రెండవ భాగం

ఇది మా చిన్న నాటి విజయనగరం లో మా తాత గారింట్లో సంక్రాంతిపండుగ జ్ఞాపకాల నుండి తవ్వి తీసిన కొన్ని రతనాలు
రెండవ భాగం
పండగ మామూళ్లు :
పెద్ద పండగ లో పండగ మామూళ్లు ఒక పెద్ద సంస్కృతీ.  పండగదగ్గరకొస్తోందంటే ఎవరెవరో ఆగంతకులు "అమ్మాపండగ మామూళ్లుఇవ్వండమ్మా!" అని గుమ్మం లో  నిలబడతారు.  సుపరిచుతులుకొందరు కొంచెం తెలిసీ తెలియని మొహాలు.   లేదు.  మామూళ్లువెంటనే ఇచ్చి పంపించేస్తారు.  అసలు చిక్కంతా అస్సలు పరిచయం లేనికొత్త మొహాల తోనే. "నిన్నెప్పుడూ చూడలేదేనువ్వు మా ఇంట్లో ఏమిపని చేసావని మామూలు  ఇవ్వాలని?" మా పెద్దవాళ్ళు అడుగుతారు.  అల్లా అడగ్గానే "ఎప్పుడో తేలు మంత్రం వేసామనోప్రశ్న చెప్పామనోకారాలు దంచామనో సర్ది చెప్పి మామూలు  తీసుకుని  వెళ్ళిపోతారు 
మామూళ్లు కోసం ఒక 40 మంది వచ్చి వెళ్లడం మా ఇంట్లో షరామామూలే
పేకాటలు
ఇక పండగ కీ పేకాటకి ఉన్న పడుగూ పేక కి ఉన్న బంధం లాంటిదిపండుగలలో పేకాట ఒక పిల్ల కాలువ లా మొదలవుతుంది.  అప్పుడేమూతి మీద మీసాలు మొలిచిన ఒక కుర్ర కుంక పండగలో ఆడడానికానికొన్ని రోజుల ముందే ఒక రెండు దస్తాలు పీకలు కొనుక్కుని వస్తాడు.
"పేకాటలు పండగ ఒక్క రోజు నాడే ఆడాల్రోయ్అప్పుడే పేకాటలుమొదలెట్టేయకండి " పెద్దలనుంచి వార్నింగ్  వొస్తుంది
"ఆబ్బెఆడట్లేదు.  క్రొత్త పేకలు  కదాకొంచెం కోత వేస్తె ముక్కలుజారకుండా ఉంటాయి.  కోత వేసి దాచేస్తాం." అని చెప్తాడు కుర్ర కుంక.  
బుద్దిగా ఒక మూల కూర్చునిపేక దస్తాలు విప్పి తన ఒంటి చేతికే పక్కలేని మరొక చేతికి ముక్క్కలు పంచి కలిపెయ్య బోతాడు
అప్పుడే వస్తాడు ఒక మేన మామో , మేన బావో .   "అలా పంచినముక్కలు కలిపెయ్యకోయే.   అవి పేక ముక్కలను అవమానపరచడం.  ముక్కలు పంచినందుకు ఆడేసి కలిపెయ్యాలి " అని కూర్చుని  రెండోచేతి ముక్కలని తన చేతిలోకి తీసుకుని ఇద్దరూ ఆడడంమొదలెడతారుఇంకొకాట , ఇంకోకాట అను రెండు మూడు కలుపులుకలుతారుఇంతట్లో మరో మూడో మనిషొస్తాడు.  "ఏమిటోయ్కొత్తపేకలు కోతకొచ్చాయా?" అదేదో పంటలు కోతకు వచ్చాయా అన్న రేంజ్ లోఅడిగి ఆటలో చేరుతాడు.  అలా నాలుగో మనిషిఇలా ఆటగాళ్ల సంఖ్యపెరిగి 15-20 కు చేరేది
అలా పండగ కి వారం రోజుల ముందే పిల్లకాలవలా మొదలయినపేకాటఉద్యమం ఊపు అందుకుంటుంది.  ఎంత ఊపంటేబోగి నాడుబోగి మంటలకి అందరూ నిద్ర లేస్తేపేకాటరాయుళ్ల మాత్రంనిద్రలేవక్కరలేకుండానే రాత్రంతా ఆడుతున్న పేక పక్కన పడేసి బోగిమంటల దగ్గరకి వెళ్లేంత.
కొన్ని ఇళ్లలో  పాత పేక దస్తాలను బోగి మంటలలో పడేసికొత్త పేక కోతవేసే సాంప్రదాయం కూడా ఉంది 
ఒక్కొక్క సారి సంక్రాంతి కి మొదలయిన పేకాట జైత్ర యాత్ర లా ఫిబ్రవరిమార్చ్ ఏప్రిల్ లో జరిగే పెళ్లిళ్ల వరకూ కొనసాగిన గురుతు కూడా ఉంది.   ఇక ఎక్కువ సేపు పేకాట రికార్డు గురించి చెప్పాలంటేఒక గుంపునాలుగు రోజులు పగలూ రాత్రీ కదలకుండా పేకాడిన వైనం కూడా ఉంది
సినిమాలు:
పండగలు కొత్త సినిమాలని తెస్తాయాకొత్త సినిమాలు పండగలనితెస్తాయా అంటే విడదీసి చెప్పడం కష్టం.  పండగ వాతావరణాన్నిపదిమందీ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకా అన్నట్టుపండగల లో కొత్త సినిమాలు రిలీజ్  అవ్వడం,మా ఇంటి నుంచి 40 50 మంది వరకూ 10-15  రిక్షాలు వరుసగా కట్టించుకుని తరలి వెళ్లడంరివాజు.  ఇంటి దగ్గర కంటేఇంటికి దూరం గా ఉన్న థియేటర్ కి వెళ్లడంలో ఒక కిక్కు ఉంది.  అప్పుడైతే రిక్షా ఎక్కొచ్చుమధ్య లో కూల్ డ్రింక్ఉప్పో కారం వేసి వేయించిన జీడిపప్పు పాకేజ్ తో పండగ లో చూసేఎంత చెత్త సినిమా అయినా అదో గొప్ప 
వంటలుపిండి వంటలు
ఇంట్లో ఉన్న 60 మందిబయట నుండి వచ్చి పోయే వారితో కలిపిసుమారు 100 మందికి పండగ భోజనాల కోసం మా తాత గారింట్లో ప్రతీశుభ కార్యానికి వంట బ్రాహ్మణులు వచ్చేవారు.  ఈరోజు వంట చేయాలో రోజుకు ముందు రోజు రాత్రే వచ్చేసేవారు.  కనీసం 3-4 వంట బ్రాహ్మణులువచ్చేవారు.  మా ఇంట్లో పెద్ద పాత్రలు గంగాళాలు ఉన్నావంటబ్రాహ్మణులు వారి పాత్రలుగరిటెలు తెచ్చుకునేవారు.  వారికి అలవాటైనపాత్రలతో సులువుగా వుంటుందనే వారు.  తెల్లవారు జామునే 3-4 గంటలకి లేచి స్నానాలు చేసికూరలు తరగడం తో వంటలు మొదలుపెట్టేవారు.  వాతావరణాన్ని బట్టి పైకప్పు లేని మండువా లోగిలి లో గాని,  వంటింటి వెనుక ఉన్న గదిలో కానీ వంటలు చేసేవారు.  వంటలు వండేపరిసర ప్రాంతాలకు ఎవరూముఖ్యం గా పిల్లలూకుక్కలుపిల్లులూరాకుండా ఉండడానికి గట్టి బందోబస్తు చేసేవారు.  వంట వారిలో ఎవరోఒకరు ఎప్పుడూ ఎవరూ దగ్గరకు రాకుండా అప్రమత్తం గా ఒకకన్నేసుంచేవారు
పొద్దున్న 9 గంటలకల్లా వేడి ఫలహారాలుగిన్నె డికాషన్ కాఫీ సిద్ధంచేసేసేవారు.  లేత అరిటాకులో వేసిన వేడి ఉప్మా కి అరిటాకు నల్లగాకమిలిపోయి ఉప్మా మరింత రుచిని పొందడం ఒక గొప్ప జ్ఞాపకం
మధ్యాహ్నం 12 గంటల కల్లా వేడి భోజనాలు సిద్ధం చేసేవారు.  అంతసేపు వంట చేసి అలసిపోయినా కూడా,  వంట బ్రాహ్మణులూఅత్యోత్సాహంతో వడి గా నడుస్తూ అందర్నీ పలకరిస్తూచిరునవ్వుతోవడ్డించేవారు.  వడ్డిస్తూవారు వడ్డిస్తున్న వంటకం పేరు ని పదే  "అన్నంఅన్నంఅన్నం",   "పప్పుపప్పుపప్పు", వొడియాలువొడియాలువొడియాలుఅని ప్రకటిస్తూ వడ్డించేవారు.  పోనీ వారు ముందుతిన్నారా అంటేఅందరికీ వడ్డిస్తే కానీ తినేవారు కాదుఅయినాఉత్సాహంగా హుషారు గా ఉండేవారు
అప్పటికే నెల రోజులు పండగ వాతావరణం ఉన్నాఎప్పుడువెళ్లిపోతున్నారో తెలియకుండా బంధువులందరూ ఒక్కొక్కరూ రిక్షాకట్టించుకుని బస్సు స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి ప్రయాణాలు కట్టేస్తూఉంటారు.   చూస్తుండగా ఇల్లు బోసి పోయి 60 నుంచి 20 మందికిదిగిపోతుంది.  మళ్ళీ మరో శుభ కార్యానికి మెల్లిగా పుంజుకుంటూఉంటుంది.  
సంక్రాంతి పండగ అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే.  తేడా అల్లా పదిమందికలవడం లో ఉందికలవాలని తపించే మనసులోనే నిజమైన పండగఉంటుంది
(సంపూర్ణం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి