27, జులై 2010, మంగళవారం

ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్

మనం కొన్ని పదాలు, వాక్యాలు, భావాలు, వింటుంటాము  కానీ లోతుగా పరిశోధించం. పరిశోధించడానికి ప్రయత్నం కూడా చెయ్యం. పైపైన తెలిస్తే చాలనుకుంటాము. అంతరార్ధం తెలియక పోయినా పర్వాలేదు అనుకుంటాము. కాని, ఒక్క సారి మనకి తెలియని అంతరార్ధం - అది ఎంత చిన్న విషయమైనా కావచ్చు - తెలిస్తే, ఎంత ఆనందంగా, గర్వం గా ఉంటుందో ఈ మధ్య నే నాకు స్వయం గా అనుభవం అయ్యింది. అది తెలిసిన తర్వాత - ఇంత చిన్న విషయం ఎప్పుడూ ఎందుకు విశ్లేషించ లేదా - అనిపించింది.

ఈ మధ్య - మా పెద్ద వాడికి గ్రేడ్ 9 ఇంగ్లీష్ poetry  ప్రాజెక్ట్ లో హెల్ప్ చేస్తూంటే,  ఒక మాతృ భాష (తెలుగు)  పద్యాన్ని ఆంగ్లం లోకి అనువదించి, మన మాతృ భాష గురించి ఒక రెండు వాక్యాలు రాయాల్సిన అవసరం పడింది.  
మన మాతృ భాష గురించి ఎన్నాళ్ళు గానో వింటున్న ఒక పోలిక "తెలుగు ఈస్ ద ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్" అని రాయమని చెప్పాను.

కాని ఎందుకలా అంటారో అని మా పెద్దాడు అడిగితే - సమాధానం చెప్పలేక పోయాను. ఎందుకంటే - నాకే తెలీదు.  ఇద్దరమూ కలసి వికీపీడియా లో వెతికాము. ఒక సమాధానం తెలిసింది. ఇటాలియన్ లొనూ తెలుగు లొనూ చాలా పదాలు అచ్చులతో  (వొవెల్స్ తో) అంతం అవుతాయట.  ఉదాహరణకి -  పిజ్జా (అకారంతం), macaroni (ఇకారాంతం) ఇవి ఇటాలియన్ భాష పదాలు.  మన తెలుగు లోనూ అంతే కదా - కిటికీ (ఇకారాంతం), అటక (అకారాంతం) తదితరాలు.

విషయం చిన్నదే కావచ్చు; మనలో చాలా మందికి తెలిసినదే కావచ్చు.  కాని - నాకు తెలీదు. ఈ సందర్భంలో జిడ్డు కృష్ణ మూర్తి గారు తరచుగా చెప్పే ఒకే ఒక తత్త్వం గుర్తుకొస్తుంది. 
"తెలియకపోతే - శోధించు".

9 కామెంట్‌లు:

 1. మీ శోధనని అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  అన్నట్టు, తెలుగు వికీపీడియా కూడా ఉంది. చూడండి, దాన్ని మెరుగుపరచడానికి మీరూ ఓ చేయి వేయండి.

  రిప్లయితొలగించండి
 2. సంతోషం! మీ మిత్రులని కూడా తెలుగు అంతర్జాలనికి పరిచయం చెయ్యండి. వారు కూడ తమ రచనలని, అభిప్రాయలని తెలుగులోనే మిగతావారితో పంచుకోవచ్చు.
  తెలుగు భాషకి సేవ చేసినవారవుతారు!

  రిప్లయితొలగించండి
 3. చాలా చక్కగా చెప్పారండి! ఎంత చిన్న విషయమైనా మనకు తెలియనంత వరకూ అది పెద్ద విషయంగానే భావించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తేనే ఎదుగుదల స్స్ధ్యం ఔతుంది.
  చక్కని వివరననిచ్చిన మీకు ధన్యవాదాలు.
  http://andhraamrutham.blogspot.com

  రిప్లయితొలగించండి
 4. బావుంది. నేనింత కాలం ఇటాలియన్ భాష తెలుగంత గొప్పదీ, మధురమైనదీ అని అలా అన్నారను కొన్నాను!

  అన్నట్లు, నేను కూడా కొద్దిగా శోధించి, అసలీ మాట అన్నది ఆంగ్లేయుడు కాదనీ, బహు బాషా కోవిదుడైన ఒక ఇటాలియన్ ప్రముఖుడు, Niccolò de' Conti (1385–1469) సెలవిచ్చాడని తెలుసుకొని సంతోషించాను!

  రిప్లయితొలగించండి
 5. మీరు చెప్పింది అక్షరాలా సత్యం సాయి గారూ. ప్రముఖ రచయితల గురించి ఇంటర్నెట్లో చదువుతున్నపుడు తెలుగు భాషను ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అంటారని, ఎందుకు అంటారని చదివి తెలుసుకున్నాను గాని, మీరు చెప్పిన ఉదాహరణలతో అన్వయించలేదు. ఆహా నాకూ తెలిసిపోయింది ( పూర్తిగా తెలియదు) అనుకుని ఊరుకున్నాను కానీ సోధించలేదు. పిజ్జా, అటక, కిటికీ అని మీరు వివరిస్తే తెలిసింది. థాంక్స్ అండీ.

  రిప్లయితొలగించండి
 6. ఈ పాత టపాలో విషయమూ, దానికింద జరిగిన చర్చ కూడా మీకు ఆసక్తిగా అనిపించవచ్చు.

  రిప్లయితొలగించండి
 7. ధన్యవాదములు,
  నెను ఈ రోజు కొత్త విషయం తెలుసుకున్నాను

  రిప్లయితొలగించండి
 8. నా బ్లాగ్ పై స్పందించి అభిప్రాయాలను వ్యక్తం చేసిన శ్రేయోభిలాషులందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సదభిమానంతో మీరు చేసిన వ్యాఖ్యలు నాకెంతగానో స్ఫూర్తినిస్తున్నాయి.

  రిప్లయితొలగించండి
 9. కనుగొంటినీ.....క్షమించాలి...తెలుసు కొంటినీ....కృతజ్ఞతలండీ..మా పిల్లలకి చెపుతాను.

  రిప్లయితొలగించండి