26, జులై 2010, సోమవారం

లేట్ గా వచ్చినా...లేటెస్ట్ గా వస్తా...

"ఆగు"...

పలక బలపం పట్టుకుని తలవంచుకుని బ్లాగ్ లోకి అడుగు పెట్టబోతున్న నేను గతుక్కుమని ఆగాను.

ఎదురుగా సింహం లాంటి సత్యం మాస్టారు...

"బ్లాగ్ తెరిచి ఎన్నాళ్ళు అయ్యిందో తెలుసా?" కంటి చూపు తోనే వొణుకు పుట్టించేలా ఉన్నాయి మాస్టారి కళ్ళు.

"సుమారు, పదిహేను రోజులయిన్దనుకుంటా"...బయటికి అన్నానో నాలో నేనే అనుకున్నానో తెలియదు.

"ఇది బ్లాగ్ అనుకున్నారా సినిమా theatre అనుకున్నారా...ఓపెన్ అయ్యిన పదిహేను రోజులకి రావడానికి..."

తలెత్తి చూసే ధైర్యం చాలలేదు నాకు...

"ఊఁ...సరే....లోపలి వెళ్లి కూచోండి" గదమాయించారు సత్యం మాష్టారు.

బ్రతుకు జీవుడా అని నెమ్మదిగా నడుచుకుంటూ ఫస్ట్ బెంచ్ మీద కూర్చోవడానికి వెళ్ళబోతున్నాను.

"ఇంతకూ, బ్లాగ్ లో రాయడానికి ఏం తెచ్చారు?" కంచు లా మోగింది మాష్టారి కంఠం.

మెల్లిగా ఒడికాన్చుకున్న పలకని మాష్టారి వైపు తిప్పి చూపించాను.

ఇక ఏ క్షణం లో నైనా తుఫాన్ తప్పదనుకున్నా!
"హ..హ..హ..హ.."
సత్యం మాష్టారు పగలబడి నవ్వుతున్నారు..

నేను చిన్నగా నవ్వాను - నా పలక మీద రాతని తలుచుకుని.

ఇంతకూ ఏం రాసానంటే - ఒకానొకా సినిమా లో రజని కాంత్ డైలాగ్

"లేట్ గా వచ్చినా...లేటెస్ట్ గా వస్తా."

(కొసమెరుపు: సత్యం గారు పదిహేను రోజుల కిందటే చెప్పినా, బ్లాగ్ లోకి లేట్ గా ఎంటర్ అయ్యిన్నందుకు నా మీద నేను వేసుకున్న satire ఇది).

6 కామెంట్‌లు:

  1. హ..హ..హ..హ..
    సెటైర్ అదిరింది! లేటుగా వచ్చినా ఘాటుగానే వుంది సమాధానం! పొట్ట చక్కలయిపోయింది!!
    ఎంతైనా రచయితలా మజాకానా!!

    కానీ కనీసం వారానికొక్క టపా అన్నా మీరు వ్రాయకపోతే మీకు గోడకుర్చీ తప్పదు మరి!! :)

    రిప్లయితొలగించండి
  2. సరదాగా రాసిన నా ఈ చిన్ని బ్లాగ్ పై స్పందించి అభిప్రాయాలను వ్యక్తం చేసిన శ్రేయోభిలాషులందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సదభిమానంతో మీరు చేసిన వ్యాఖ్యలు నాకెంతగానో స్ఫూర్తినిస్తున్నాయి

    రిప్లయితొలగించండి
  3. సాయిప్రసాద్ గారు, మొన్న మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషమైంది.
    తరచూ రాయండి.

    రిప్లయితొలగించండి
  4. కొత్త పాళీ గారు,

    నాకు కూడా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం గా వుంది. మీ సలహాలు, సూచనలు పాటించి తరచుగా బ్లాగ్గుతాము.

    సాయి ప్రసాద్

    రిప్లయితొలగించండి