తెలుగు వాహిని లిటరరీ అసోసియేషన్లో కొన్ని నెలల క్రితం "రెండు నిమిషాలు తెలుగులో మాత్రమే మాట్లాడుదాం!" అనే ఆటను (ఇంగ్లీష్ పదాలు దొర్లకుండా) ఒక సభ్యుడు ప్రవేశ పెట్టారు. దీనికి రెస్పాన్స్ గా నేను ఊరికే కవ్విస్తూ ఒక email పంపించాను. ఏమని అంటే:
"ఐడియా చాలా బాగుంది. ఐతే ఇంగ్లీష్ మీదేనా మీ యుద్ధం? ఆంగ్ల పదాలే కాక...పెర్షియన్ మరియు సంస్కృత పదాలు కూడా తీసేస్తే కదా మనకి అచ్చ తెలుగు వచ్చేది? మన అమాయకత్వం వల్ల మనం తెలుగు అనుకునే ఎన్నో మాటలు తెలుగువే కాదు. కాబట్టి, "javaabu", "asalu", "roju", "aasara", "rujuvu" లాంటి
పెర్షియన్ పదాలు..."anandam", "santhosham", "bhayam", "dhukkam", "bhaasha" లాంటి సంస్కృత పదాలు...కూడా వాడకూడదు. అప్పుడు చూద్దాము "అచ్చ తెలుగు చిచ్చరపిడుగు" బిరుదు ఎవరు పొందుతారో. ఏమంటారు? పోరు కి సిద్ధమా?"
దీనికి జవాబు గా మరొక సభ్యుడు: "అయ్యో...ఇన్నాళ్ళూ తెలుగు భాషలో మాట్లాడుతున్నప్పుడు, ఆంగ్లం కాని పదాలన్ని తెలుగే అనుకున్నా ను. అది కాదని ఇప్పుడు తెలిసింది. ఈ సందర్భం లో సరదాగా కాస్సేపు సభ్యులెవరైనా ఈ సమస్యా పూరణం గావించగలరేమో చూడండి: "అక్కటా! తెనుగు తెనుగు కాదనియే త్రివిక్రమ సింగరాయా"
దీనికి response గా సభ్యులు వెను వెంటనే ఈ క్రింది పూరణలు పంపించారు. mind you , సభ్యుల లో అధిక శాతం ఏ పద్యమూ ఇంతక ముందెన్నడూ రాసి ఎరుగరు.
మధుబాల గారు :
1 ) అక్కటా! తెనుగు తెనుగు కాదనియే త్రివిక్రమ సింగరాయా
పర్షియన్, ఉర్దూ, సంస్కృతాల మేలు కలయక దీని తస్సదియ
అసలు కన్నా వడ్డీ మరెంతో ముద్దురా
అందుకే తెలుగు ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ రా!
2 ) ఆంద్ర దేశమున అశాంతి చెలరేగే
ఆంధ్రా తెలంగాణా అంటూ విభజనలు సాగే
భాషలో పొత్తుంది కానీ ప్రాంతాలలో లేదా
అక్కటా! తెనుగు తెనుగు కాదనియే త్రివిక్రమ సింగరాయా!
3 ) దేశ భాషలందు తెలుగు లెస్స అని పల్కే కృష్ణ దేవరాయ
అక్కటా! తెనుగు తెనుగు కాదనియే త్రివిక్రమ సింగరాయా
మన భాషలో తెలుగు లెస్సో మొరో తెలవలే
దీని అమ్మి తుమ్మి నేడే తెల్చవలె
సత్యంగారు:
రక్తమునందు పలుగ్రూపులు సహించలేని వ్యక్తులలో నొకండు
ట్యాంకుబండుపై విగ్రములు గూల్చిన నిక్రుష్టులలో నొకండు
చక్కటితన తెనుగు తల్లికే శీల పరీక్షల్ గావింప జేసి
అక్కటా! తెనుగు తెనుగు కాదనియే, త్రివిక్రమ సింగరాయా
హనుమంత రావు గారు:
దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికే ఆనాటి కృష్ణ దేవరాయ;
తెలుగు భాషయందు పర భాషను లెస్సు చేయమని పలికే ఈనాటి విక్రమ సింగరాయ
రవిచంద్ర వారణాసి గారు:
తెగనితెనుగుభాష, బానిసత్వవిముక్తపోరాటమ్నాది
తేలనితెనుగుస్వార్దానికితల్లినేమార్చగలపౌరుషమ్నాది
తెలిసితెనుగుఆస్తులనుపోగొట్టుకుంటున్నమూర్ఖత్వమ్నాది, అక్కటా! ఆ(
తెనుగుతెనుగుకాదనియే, త్రివిక్రమసింగరాయా
స్మిత వేమ్పాటి గారు:27 మాత్రలతో ప్రయత్నం:
తెనుగు దేశమంత సంచారమొనర్చి యె ల్లజనుల తోడ
తెనుగున మాటలాడి మిశ్ర భాషతొ విసుగు చెంది, అక్కట!
తెనుగు తెనుగు కాదనియె త్రివిక్రమ సింగరాయ, అచ్చమగు
తెనుంగు భాషయన్న యాతనికెంత యెనలేని మక్కువో!
III UIUI UUIIUI UIIII UI = 27
IIII UIUI UI UII III UI UII = 27
III III UIII IUII UIUI UIII = 27
IUI UIUI UIIUI IIUI UIU = 27
మాలతిగారు:
ఇన్నాళ్ళు ఇతర పదములు కలిసినా తెలుగు తీయదనము తగ్గదాయే
దీని సిగ తరగ ఈ ఆంగ్ల పదములు తో తెలుగు రూపమే మారిపోయే
కలుపు కుందామంటే కలవ కున్నదయ్యా, కావవయ్యా, ఓ సింగరాయ
శ్రీరామం దగ్గుపాటి గారు:
1 ) తీపిగల సర్వనదుల నీరుసంద్రమున కలసి
తీపి కోల్పోయి ఉప్పనైనట్లు,సర్వభాషల
తీపి, తేనెయగు తెనుగుతల్లికి వికటమై
తీపితొలెగె, అక్కటా! తెనుగు తెనుగు కాదనియె త్రివిక్రమ సింగరాయా.
2 ) ఆరు రుచుల భోజనంబు తెలుంగులకు పసందౌ రీతిన్
ఆరు రుచుల పచ్చడి తెలుగులకు యుగాదినాట మొదటి
ఆరగింపైనటుల ఆరేమిటి అరవై భాషల కటుతరమిశ్రమైన నేమి సు
స్వర తేనెయగు తెనుగు తెనుగే అక్కటా! తెనుగు తెనుగు కాదనియె త్రివిక్రమ సింగరాయా.
3 ) పెక్కు భాషా పదముల ధాతువులంగొని, తెలుగు ప్రత్యయముల్
మిక్కిలి సొంపుగ పొందుపర్చి సంతసముగ చేర్చుకొనెగదా
అక్కున కన్నతల్లివలె అభాగ్యులైన సంకర భాషలను
అక్కటా తెనుగు తెనుగు కాదనియె త్రివిక్రమ సింగరాయా.
త్రివిక్రమ్ గారు:
Fantastic!! I never thought that a small teaser email from me could inspire such
tasteful literature. I should thank Sai Prasad garu for firing the
pot, and Madhu Bala garu, Malathi garu, Smitha garu, Hanumantha Rao
garu, Satyam garu, Ravi Chandra గారు అండ్ అల్ others for stirring it. Anyway, I now
make a trifling attempt to extend my original thought to conclude this
thread:
గోండ్ కొండ కోయ మండ పర్జి గడబ కొలమి పెంగో నైకి కువిల పెద్దన్నే తెనుగటా!
ఆంగ్ల సంస్కృత పర్షియన్ సంకరాన కల్గిన మనం బాసాడె కొత్త తెనుగు, అక్కటా!!
ఈ తెనుగు తెనుగే కాదనియె త్రివిక్రమ సింగరాయ!!!
.................
ఇలా జరిగింది అనమాట అప్పటి మా పద్యాలతో"రణం"!
మన పద్య కవితలు (పద్యాల్లాంటి వచన కవితలు!) అధిరి పోతున్నయ్! వీటిని బ్లాగు తెరకు ఎక్కించినందుకు ధన్యవాదములు! :-)
రిప్లయితొలగించండి