22, నవంబర్ 2011, మంగళవారం

శ్రద్ధాంజలి


మా నాన్నగారు శ్రీ గురుజాడ రామ మూర్తిగారు క్రిందటి నెల శివ సానిధ్యం చెందారు. వారు నాకు జీవితంలొ నేర్పిన కొన్ని జీవిత సత్యాలను గుర్తు చేసుకుంటూ నేను వారికి ఇచ్చే ప్రేమపూర్వక శ్రద్ధాంజలి.



భక్తికి భాష తొ పనిలేదు
మంత్ర తంత్రాల అవసరం లేదు
నిశ్చల శ్రద్దతో చేసిన నామస్మరణం
శివసానిధ్యం ఇస్తుందని పల్కిన పుణ్యమూర్తివి



కష్ట సుఖాలు కావడికుండలని
విజయంలొ విర్రవీగకని
విజయం వెనుకే అపజయం దాగుంటుందని
జీవితాన పాటించి చూపిన ధర్మ మూర్తివి

పుత్ర జననం పుణ్యమని భావించే తరంలొ
పుత్రుడైన పుత్రికైన ఒక్కటెనని మస్పూర్తిగా
నమ్మి ఆడపిల్ల ఎందులొను ఎవరికి తక్కువకాదని
ఆతరంలోనే నమ్మి ఆత్మ గౌరవంతో పెంచిన ఆదర్శ మూర్తివి

తప్పులు లెంచిన ప్రతివారిలోనూ వుండునని
తప్పులెంచుట మాని మంచి చూచుట మెండని
భగవంతుని స్రుష్టీంతా మంచేనని
చూచే నీ ద్రుక్కొణం మార్చమని నేర్పిన దయా మూర్తివి

వస్తావు వొట్టిగా పోతావు వొట్టిగా
జీవన పయనంలొ నమ్ము భగవంతుని ఒక్కని
ఆతడే చేరుస్తాడు నీ జీవన నావని సుఖ తీరాలకు
అని నమ్మి అచరించి శివ సానిధ్యం చేరిన దివ్య మూర్తివి